E-Paper
Advertisement

Another Shock to Mallareddy: మల్లారెడ్డికి మరో షాక్.. ఈసారి జేసీబీలతో కూల్చివేత!

Another Shock to Mallareddy: మల్లారెడ్డికి మరో షాక్.. ఈసారి జేసీబీలతో కూల్చివేత!
Advertisement

Another Shock to Mallareddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులు తున్నాయి. ఆయనకు సంబంధించిన భూ వివాదాలు ఒకొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. గడిచిన ఐదు నెలల్లో నాలుగు బయటపడ్డాయి. వాటిలో మేడ్చల్, దుండిగల్, సుచిత్ర, శామీర్‌పేట్ ప్రాంతాల్లో కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు.

తాజాగా శామీర్‌పేట్‌ మండలం బొమ్రాసిపేట పెద్ద చెరువు ఆక్రమించి నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ఈ విషయంలో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దగ్గరుండి జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. ఇదేకాకుండా పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను సైతం కూల్చివేశారు.

Advertisement

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. మేడ్చల్‌లోని తన కాలేజీకి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్టు ఫిర్యాదు అందాయి. వెంటనే అధికారులు సర్వే చేశారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టు గుర్తించారు. అందుకు సంబంధించిన ప్రహరీగోడను కూల్చివేశారు. దుండిగల్ సమీపంలోని చెరువుకు సంబంధించిన భూమి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు అధికారులు గుర్తించారు.

Also Read: కవిత బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా..

Advertisement

వారం కిందట సుచిత్ర వద్ద సర్వే నంబర్ 82లో రెండున్నర ఎకరాల భూమి ఉంది. అదంతా తమదేనని మల్లారెడ్డి పేర్కొన్నారు. మరో 15 మంది అందులో 1.11 ఎకరం భూమి తమకు చెందినది చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో మల్లారెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ క్రమంలో మల్లారెడ్డి- ఆ భూమికి చెందిన వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి జఠిలం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మల్లారెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. రానున్న రోజుల్లో మల్లారెడ్డికి సంబంధించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×