E-Paper
Advertisement

నేను డాక్టర్ అవ్వాలనుకున్నా.. కానీ: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నేను డాక్టర్ అవ్వాలనుకున్నా.. కానీ: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

Mahesh Goud: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఆరు లక్షల కోట్లు అప్పు ఉన్నా…అభివృద్ధి, సంక్షేమం ఆగలేదని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ తెలిపారు. మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ..డాక్టర్ సెల్ ఇంత సమర్థవంతంగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కమిటీ వేయడం ఆషామాషీ కాదని, పార్టీ కోసం సమయం కేటాయించినందుకు డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పారు.తాను డాక్టర్ అవ్వాలని అనుకున్నానని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కాలేకపోయానన్నారు.

వైద్య, విద్యకు ప్రాధాన్యత

Advertisement

సమాజంలో నిష్ణాత్తులైన డాక్టర్లు వస్తున్నారని, ఇది సంతోషకరమన్నారు. హైదరాబాద్ మెడికల్ హబ్ గా మారిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వైద్యం, విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పేదవారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించాలన్నారు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్ గుర్తుకు వస్తారని, ఈ తరహాలో వైద్యంలో కొత్త స్కీమ్ లకు రూపకల్పన చేసే దిశగా డాక్టర్లు ఆలోచించాలన్నారు. బీజేపీ పార్టీ మత విద్వేషాలను రెచ్చకొట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు.

మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..

Advertisement

ఇక కార్మిక లోకానికి కష్టసుఖాల్లో అండగా నిలిచే నాయకత్వం అవసరమని, అలాంటి నాయకుడిగా టీజేఈయూ అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి నిలుస్తారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లో టీజేఈయూ అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు, హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

రాజిరెడ్డి విజయం ఖాయం

రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేసే ముఖ్యమంత్రి, కార్మిక శాఖ మంత్రి ఉన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.టీజేఈయూ ఎన్నికల్లో మొగుళ్ల రాజిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు. కష్టాల్లో కార్మికుల వెంట నడిచే నాయకుడిగా రాజిరెడ్డికి మంచి గుర్తింపు ఉందని, ఆయన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి. సంజీవరెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.

Also Read: కాంగ్రెస్ సర్కార్‌కు కవిత అల్టిమేటం.. ఆ తేదీ లోపు విగ్రహం పెట్టకపోతే రచ్చ ఖాయం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×