// // Telangana Politics: సీనియర్ నేత జీవన్‌‌రెడ్డి ఇష్యూ.. హైకమాండ్ బుజ్జగింపులు, మహేష్‌కుమార్ చర్చలు -->
E-Paper
Advertisement

Telangana Politics: సీనియర్ నేత జీవన్‌‌రెడ్డి ఇష్యూ.. హైకమాండ్ బుజ్జగింపులు, మహేష్‌కుమార్ చర్చలు

Telangana Politics: సీనియర్ నేత జీవన్‌‌రెడ్డి ఇష్యూ.. హైకమాండ్ బుజ్జగింపులు, మహేష్‌కుమార్ చర్చలు
Advertisement

Telangana Politics: పార్టీకి సీనియర్ నేత జీవన్‌‌రెడ్డి గుడ్ బై చెప్పేస్తారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్.. ఆయనతో మంగళవారం  చర్చించారు. ఆయన చెప్పినవన్నీ విన్నారు. హైకమాండ్ అండగా ఉంటుందని చెప్పారు. మరి జీవన్‌‌రెడ్డి మనసులో ఏముందో?

సీనియర్ నేత జీవన్‌‌రెడ్డితో టీపీసీసీ మంతనాలు

Advertisement

రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇబ్బందులు వస్తుంటాయని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ సమీకరణాల వల్ల జీవన్ రెడ్డి ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఆయన రాజీనామా చేయరనే ఆశతో వెళ్తున్నట్లు మీడియాతో చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 63 సీట్లు గెలుచుకుందన్నారు.

సుధీర్ఘ అనుభవమున్న ఆయన, ఈ వయస్సులో ఆయన కొంత బాధపడ్డారని అన్నారు. అంతకుముందు మాజీమంత్రి జీవన్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై కొంతకాలంగా సంకేతాలు ఇస్తున్న జీవన్ రెడ్డితో నేతలు చర్చించారు.

Advertisement

హైకమాండ్ ఆదేశాలతో చర్చలు.. పార్టీలో ఉంటారని మహేష్‌కుమార్ ధీమా

ఈ సమయంలో తన డిమాండ్లను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు వివరించారు జీవన్‌రెడ్డి. ఆయన డిమాండ్లను పార్టీ పెద్దలకు వివరించనున్నారు టీపీసీసీ. ఈ చర్చల నేపథ్యంలో కొన్నాళ్లు జీవన్‌రెడ్డి వెయిట్ చేస్తారని అంటున్నారు. హైకమాండ్ నుంచి ఆయనకు సానుకూల సంకేతాలు వస్తాయని కొందరు నేతలు చెబుతున్నారు.

ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా చేస్తారనే విషయం తెలియగానే తమ పార్టీలోకి రావాలంటూ బీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జిల్లాకు ఇన్ ఛార్జ్ చేస్తామని, రానున్న ఎన్నికల్లో మీరు కోరుకున్న స్థానం ఇస్తామని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి జీవన్‌రెడ్డి మనసులో ఏముందో వెయిట్ అండ్ సీ.

ALSO READ: యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు.. హైదరాబాద్‌లో టెన్షన్ టెన్షన్!

బుధవారం జగిత్యాలలో బహిరంగ సభకు ప్లాన్ చేశారు జీవన్ రెడ్డి. దీనికి దాదాపు 5 వేల మంది కార్యకర్తలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. సభా వేదిక నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయం గురించి వివిధ వేదికల ద్వారా బహిరంగంగా వివరించారు. రాజీనామా తర్వాత కొన్నాళ్లు వెయిట్ చేసిన తర్వాత రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలాఉండగా జీవన్‌‌రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగించారు ఆయన అనుచరులు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×