E-Paper
Advertisement

SP Shabarish: ఎన్నికల విధులు సమర్థవంతగా నిర్వహించాలి.. ఎస్పీ శబరీష్ కీలక సూచనలు!

SP Shabarish: ఎన్నికల విధులు సమర్థవంతగా నిర్వహించాలి.. ఎస్పీ శబరీష్ కీలక సూచనలు!
Advertisement

SP Shabarish: మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ డా. శబరీష్ (SP Shabarish), ఐపీఎస్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం, మరిపెడ మరియు డోర్నకల్, తొర్రుర్, మున్సిపాలిటీల పరిధిలోని పలు కీలక (క్రిటికల్) పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ జరుగుతున్న విధానం, ఓటర్ల క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు మరియు పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను నేరుగా పరిశీలించారు.

Also ReadHyderabad water supply: తీరనున్న ఎస్పీఆర్ హిల్స్ నీటి కష్టాలు.. ఉగాది నాటికి పనులు పూర్తి చేయాలి : ఎండీ అశోక్ రెడ్డి!

పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు

Advertisement

పోలింగ్ స్టేషన్ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేస్తూ, ఎన్నికల విధులు పూర్తి అప్రమత్తతతో నిర్వహించాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, ఈ మున్సిపాలిటీలలో ఫిబ్రవరి 13వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియకు సంబంధించి కూడా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయి భద్రత కల్పించి, శాంతియుత వాతావరణంలో లెక్కింపు ప్రక్రియ జరగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Also Read: Best ACs Under Rs 20,000: సమ్మర్ స్పెషల్ ఏసీలు.. రూ.20,000లోపు ది బెస్ట్ ఇవే.. ఓసారి ట్రై చేయండి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×