E-Paper
Advertisement

MLA Murali Naik: కబ్జా చేసే వాళ్ళని ఓడించండి.. నిజాయితీ నాయకత్వానికే ఓటు వేయండి : ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్!

MLA Murali Naik: కబ్జా చేసే వాళ్ళని ఓడించండి.. నిజాయితీ నాయకత్వానికే ఓటు వేయండి : ఎమ్మెల్యే  భూక్య మురళి నాయక్!
Advertisement

MLA Murali Naik: మహబూబాబాద్ స్వేచ్ఛ: మహబూబాబాద్ పట్టణంలోని గుండెకాయగా ఉన్న ప్రధాన నెహ్రూ సెంటర్ లోని వ్యాపారస్తుల బాధ్యత, భద్రత తనదేనని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ (MLA Murali Naik) పేర్కొన్నారు. 19, 20, 33వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చిదిరాల అరుణ జ్ఞానేశ్వర్, హతి రామ్ నాయక్, నాళ్ల లక్ష్మీనరసింహారావు తరపున నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ సెంటర్లో ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ కరప్షన్ చేసే వారిని, కబ్జా చేసే వారిని ఓడించాలని అన్నారు. మురళి నాయక్ చాలా సౌమ్యడని అలాంటి వార్డు కౌన్సిలర్ నాళ్ళ లక్ష్మీనరసింహారావు ను 33 వ వార్డుకు వార్డు కౌన్సిలర్ గా గెలిపించుకోవాలని మీ ముందుకు తీసుకొచ్చానన్నారు.

Also Read: Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 9 మంది మావోలు హతం

వార్డు కౌన్సిలర్ గా గెలిపించుకోవాలి 

Advertisement

నాళ్ళ నరసింహారావును గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యాపారిపై ఉందని స్పష్టం చేశారు. గతంలో ఉన్న నాయకులు మీ వ్యాపారస్తుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడంతో పాటు భూమి కనిపిస్తే కబ్జా చేసేవారు ఉన్నారని నేడు అలాంటి పరిస్థితి లేదని ప్రతి ఒక్క వ్యాపారి గుండె మీద చేయి వేసుకొని నిద్రపోవచ్చన్నారు. మీ తరఫున నరసింహారావును వార్డు కౌన్సిలర్ గా గెలిపించుకొని ప్రభుత్వానికి వ్యాపారస్తులకు మధ్య వారిదిగా చేసుకోవాలన్నారు.

ప్రజలకు, వ్యాపారస్తులకు అండ

లక్ష్మీ నరసింహారావు సైతం ప్రజలకు, వ్యాపారస్తులకు అండగా నిలబడి రేయనకా పగలనకా మీకోసం పనిచేస్తాడని తెలిపారు. నరసింహారావు గెలిపించుకోవాల్సిన అవసరం వ్యాపారస్తులదేనని వెల్లడించారు. వైశ్యులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారని 19, 33 వ వార్డులను కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, ప్రముఖ వ్యాపారి చౌడవరపు మోహన్ రావు, గర్రెపల్లి రాధాకృష్ణ, నాళ్ల వీరన్న, చెర్విరాల ప్రభాకర్, ఇతర వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Mumbai Crime: యువతిపై సామూహిక అత్యాచారం.. 16 మంది డీఎన్ఏ పరిశీలన.. నిందితుల్లో తండ్రి సైతం..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×