E-Paper
Advertisement

Madapur Village: మాట తప్పని సర్పంచ్.. గ్రామంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం

Madapur Village: మాట తప్పని సర్పంచ్.. గ్రామంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం
Advertisement

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా మాదాపూర్ గ్రామ సర్పంచ్ మాదరి శ్రీనివాస్ అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి పథంలో గ్రామాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే సంకల్పంతో ఆయన తాజాగా భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

గ్రామంలోని పేరోజీపల్లి ప్రాంతంలో సుమారు 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతన సి.సి. రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ మాదరి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశానో.. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నానని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా గ్రామంలో మురుగునీటి సమస్య లేకుండా.. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొమ్మెర రవీందర్ రెడ్డి, కటకం తిరుపతి, మార్గం మల్లేశం పాల్గొన్నారు. వీరితో పాటు ఉప సర్పంచ్ కళ్లెం అనిత – మల్లారెడ్డి, వార్డు సభ్యులు మాడుగుల కరుణాకర్ రెడ్డి, గోవిందు సంతు, కత్తి శ్రీనివాస్, భూపెల్లి రమేష్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సర్పంచ్‌ను అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: Revanth Reddy: రైతులకు రేవంత్ రెడ్డి భరోసా.. ఎన్నికల తర్వాత రూ.9 వేల కోట్లు విడుదల..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×