E-Paper
Advertisement

Osmania University : ఉస్మానియాలో లైంగిక వేధింపులు.. డ్రగ్స్ కు అడ్డాగా క్యాంపస్

Osmania University : ఉస్మానియాలో లైంగిక వేధింపులు.. డ్రగ్స్ కు అడ్డాగా క్యాంపస్
Advertisement

Osmania University : ఉస్మానియా యూనివర్సిటీలో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ.. ఇఫ్లూలో విద్యార్థుల ఆందోళన చేశారు. యూనివర్సిటీలో ఎంఏ కోర్స్ చేస్తున్న విద్యార్థిని.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ.. ఓయూ వర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలిని మెడికల్ టెస్టుల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. విద్యార్థిని చీకటిలో లైంగిక వేధింపులు గురికావడంతో.. సీసీ ఫుటేజ్‌ను పోలీసులు చెక్‌ చేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించాలని విద్యార్థులు ఆందోళన చేశారు. ఘటనపై కవరేజ్‌కు వెళ్లిన మీడియాను ఇఫ్లూ అధికారులు అనుమతించలేదు.

యూనివర్సిటీలో MA కోర్స్ చేస్తున్న విద్యార్థినిపై..ఈ నెల 18వ తేదీ.. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో స్టూడెంట్ పై అత్యాచార యత్నం జరిగినట్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించి.. రిపోర్టు తెప్పించుకున్నారు. బాధిత విద్యార్థిని వాకింగ్ చేస్తున్న సమయంలో.. చీకటిలో ఘటన జరిగినట్లు చెబుతోంది. అమ్మాయిలకు ఓయూ క్యాంపస్‌లో రక్షణ కరువైందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.సురేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

గురువారం నుంచి వీసీ ప్రొఫెసర్ సురేష్ కుమార్‌ను ఛాంబర్ నుంచి బయటికి రాకుండా విద్యార్థుల ముట్టడి చేశారు. ఎట్టకేలకు పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆయన క్యాంపస్ నుంచి బయటికి వచ్చారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులను శిక్షించాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు.. ఉస్మానియా క్యాంపస్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×