E-Paper
Advertisement

Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్

Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్
Advertisement

Wine Shops Close: రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రేపు(సోమవారం) వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఇప్పటికే పలు మద్యం షాపుల వద్ద నిర్వాహకులు బోర్డులు పెట్టారు. దేశ వ్యాప్తంగా జనవరి 26న డ్రై డే పాటిస్తారు. తిరిగి జనవరి 27న మద్యం షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం షాపులు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.

మద్యం ధరలకు రెక్కలు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మందుబాబుల వీక్ నెస్ క్యాష్ చేసుకుంటున్నారు. సిండికేట్‌లుగా ఏర్పడి ఇష్టారాజ్యంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జాతర దృష్ట్యా ఎక్సైజ్ శాఖ మేడారం పరిసరాల్లో 22 తాత్కాలిక లిక్కర్ షాపులకు అనుమతులు ఇచ్చింది. 9 రోజుల పాటు సాగే ఈ విక్రయాలకు రోజుకు రూ. 9 వేల చొప్పున ప్రభుత్వం లైసెన్స్ ఫీజు వసూలు చేస్తుంది. దీంతో ప్రభుత్వానికి రూ. 17.82 లక్షల ఆదాయం సమకూరనుంది. లైసెన్స్ షాపుల కంటే ముందే వందలాది బెల్ట్ షాపులు, హోటళ్లు, కిరాణా షాపుల్లో మద్యం దొరికింది.

Advertisement

గత రెండు నెలల్లో ఇక్కడ సుమారు రూ. 1.40 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. మద్యం వ్యాపారులు ఒక్కో బాటిల్‌పై రూ. 50 నుంచి రూ. 100 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లైట్ బీర్ అసలు ధర రూ. 180 ఉండగా, దీనిని రూ. 250కి పైగా అమ్ముతున్నారు. స్ట్రాంగ్ బీర్ రూ. 290 వరకు విక్రయిస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×