E-Paper
Advertisement

Huzurabad Hospital: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తీవ్ర ఇబ్బందులు .. పట్టించుకోని అధికారులు!

Huzurabad Hospital: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తీవ్ర ఇబ్బందులు .. పట్టించుకోని అధికారులు!
Advertisement

Huzurabad Hospital: హుజురాబాద్, స్వేచ్ఛ : హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలోని లిఫ్టు చెడిపోయి నిరుపయోగంగా ఉన్నా, సంబంధిత అధికారులు కనీసం మరమ్మతులు చేయించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నరకప్రాయంగా మారిన రాకపోకలు

లిఫ్టు పనిచేయకపోవడంతో ఆపరేషన్ అయిన మహిళలు, గర్భిణీ స్త్రీలు, డెలివరీ అయిన బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో అంతస్తు నుంచి మెట్ల ద్వారా కిందకు దిగాలంటే వారు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను స్ట్రెచర్ల మీద మోసుకెళ్లడం అటెండర్లకు భారంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద ప్రజల పట్ల అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: Heavy Rain Alert: తెలంగాణ‌కు వెద‌ర్ అల‌ర్ట్.. 2 రోజుల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో వడగళ్ల వాన పడే ఛాన్స్

ప్రైవేటుకు ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదా?

ఈ సందర్భంగా ప్రజా సంఘాల ప్రతినిధి వేల్పుల ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్న సమస్య తలెత్తినా ఐదు నిమిషాల్లో పరిష్కరించే మేనేజ్మెంట్ ఉంటుంది. కానీ, వందలాది మంది వచ్చే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత పెద్ద సమస్య ఉన్నా సూపర్నెంట్ గారు స్పందించకపోవడం దారుణం. పేషెంట్ల ట్రీట్మెంట్ విషయంలో మరియు సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహించడం తగదు” అని మండిపడ్డారు.

ప్రజా సంఘాల విన్నపం

Advertisement

తక్షణమే ఆసుపత్రి అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన లిఫ్టుకు మరమ్మతులు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం మరియు భద్రత దృష్ట్యా నిర్లక్ష్యాన్ని వీడి, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Also Read: Flying Kiss Case Sentence: తొమ్మిదేళ్ల క్రితం మైనర్ బాలికకు ఫ్లయింగ్ కిస్.. ముంబై కోర్టు సంచలన తీర్పు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×