E-Paper
Advertisement

Naveen: ‘విక్రమ్’ సినిమాలా నవీన్ మర్డర్.. హరహరకృష్ణ టెరిఫిక్..

Naveen: ‘విక్రమ్’ సినిమాలా నవీన్ మర్డర్.. హరహరకృష్ణ టెరిఫిక్..
Advertisement

Naveen: పోలీసులుసంచలనం రేకెత్తించిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. నవీన్‌ను హత్య చేసి శరీర భాగాలు విడతీయడానికి యూట్యూబ్‌లో వెతికినట్లు నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. క్రైమ్ సినిమాలు ఎక్కువ చూసి హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. విక్రమ్ సినిమా తరహాలో నవీన్‌ను హత్య చేసి శరీర భాగాలను బ్యాగ్‌లో తీసుకెళ్లి.. కాల్చేసినట్టు పోలీసుల విచారణలో తెలిపాడు.

టెక్నికల్‌గా ఎలాంటి ఆధారాలు దొరక్కుండా నిందితుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎవరైనా అతడికి సాయం చేశారా? సలహాలేమైనా ఇచ్చారా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నవీన్ హత్యకు నిందితుడు హరిహరకృష్ణ తన స్నేహితుల సహాయం తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాట్ ఆధారంగా స్నేహితుల లిస్టును పోలీసులు సేకరించారు.

Advertisement

దారుణ హత్య చేశానన్న పశ్చాత్తాపం హరిహరకృష్ణలో ఏ మాత్రం కనిపించడంలేదన్నారు పోలీసులు. విచారణ సమయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నాడట. నిందితుడు విచారణకు సహకరించడంలేదని తెలుస్తోంది.

నవీన్‌ని హత్య చేయడానికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా? ఇంకేమైనా గొడవలున్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అతని ప్రేయసిని పలుమార్లు ప్రశ్నించారు. ఆమె నుంచి ఎలాంటి సమాచారమూ లేదు. మూడుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చి విచారించగా.. హత్యలో ఆమె ప్రమేయం లేదని తేలినట్టు పోలీసులు చెప్పారు.

Advertisement

మరోవైపు, నవీన్‌ హత్య కేసులో మరోసారి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసేందుకు హరిహరకృష్ణను పోలీసులు మళ్లీ బయటకి తీసుకెళ్లారు. నిందితుడు గతంలో చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు నిర్వహించారు. హత్య జరిగిన స్థలంతో పాటు, నిందితుడు ఉండే అంబర్‌పేటలోని ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బ్రాహ్మణపల్లిలోని హరిహరకృష్ణ స్నేహితుడు హసన్‌ ఇంటికి కూడా తీసుకెళ్లారు. ఫిబ్రవరి 17 నుంచి అర్ధరాత్రి హత్య జరిగే వరకు.. నిందితుడు తిరిగిన అన్ని ప్రదేశాలకు పోలీసులు మరోసారి తీసుకెళ్లారు. పక్కా ఆధారాలు సేకరిస్తూ.. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×