E-Paper
Advertisement

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం
Advertisement

Shamshabad Airport: దేశంలో ఏవియేషన్ రంగానికి కొత్త సమస్యలు రెట్టింపు అవుతున్నాయి? లేజర్ దాడులు విమానాలను బెంబేలెత్తిస్తున్నాయా? ఈ తరహా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయా? రెండేళ్లలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 100కు పైగా కేసులు నమోదు కావడం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఏం జరుగుతోంది?

దేశంలో విమాన రంగానికి కొత్త కష్టాలు-దేశంలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో కొత్త కష్టాలు మొదలయ్యాయి. 43 ఎయిర్‌పోర్టుల్లో 1000 కు పైగా లేజర్ దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో 10 శాతం ఒక్క శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ముంబై, బెంగళూరు కంటే ఈ తరహా కేసులు ఎక్కువగా హైదరాబాద్‌లో నమోదయ్యాయి. ఈ విషయంలో ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా తర్వాత హైదరాబాద్

Advertisement

విమానాలపై లేజర్ దాడులు-నాలుగో స్థానంలో నిలిచింది. కొన్ని సెకన్లపాటు లేజర్ కాంతి పైలట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతుందని  ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ చెబుతోంది. విమాన భద్రతకు తీవ్ర ముప్పని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పైలట్లు. గడిచిన రెండేళ్లుగా 100కి పైగా లేజర్ బీమ్ ఘటనలు నమోదు అయ్యాయి.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం-ఆ తరహా ఘటనలు ఎక్కువగా ప్రభావితమైన ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్‌ ఒకటిగా నిలిచింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో విమానాల భద్రతకు కొత్త ముప్పు పొంచి ఉంది. విమానాలు టేకాఫ్ అయినప్పుడు, ల్యాండింగ్ సమయంలో వాటిపై శక్తివంతమైన లేజర్ కిరణాలు పడుతున్నాయి.

Advertisement

దాదాపు రెండు వారాల కిందట జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ సిటీ నుండి శంషాబాద్‌కు లూఫ్తాన్సా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానానికి ల్యాండింగ్ సమయంలో ఈ తరహా ఘటన ఎదురైంది. రన్‌వేపైకి వస్తున్న క్రమంలో విమానం కాక్‌పిట్‌పై లేజర్ కిరణాలు పడ్డాయి. పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పిన విషయం తెల్సిందే.

ALSO READ: ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ఫాంహౌస్‌లు, ఫంక్షన్ హాళ్లు, పెళ్లి వేడుకల్లో డీజే లైట్లు, హై-పవర్ లేజర్ బీమ్స్ విమానాల మార్గానికి అడ్డుగా వస్తున్నట్లు గుర్తించారు శంషాబాద్ పోలీసులు. ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో ఫాంహౌస్‌లు, వెడ్డింగ్ హాళ్ల ఓనర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. విమానాల భద్రతకు భంగం కలిగించేలా లేజర్ లైట్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పకనే చెప్పారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×