E-Paper
Advertisement

Chinnareddy Bribery Case: ఏసీబీ పంజా.. రూ. 15లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎస్ఈ!

Chinnareddy Bribery Case: ఏసీబీ పంజా.. రూ. 15లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎస్ఈ!
Advertisement

Chinnareddy Bribery Case: కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన భారీ అవినీతి ఉదంతం కలకలం రేపుతోంది. రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE) చిన్నారెడ్డి, ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.

నగరంలోని చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించే పనుల కోసం జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్‌లో ఒక కాంట్రాక్టర్ సుమారు రూ. 1.40 కోట్ల విలువైన పనులను దక్కించుకుని, విజయవంతంగా పూర్తి చేశారు. అయితే.. ఆ పనులకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేయడానికి కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో ఎస్ఈగా పనిచేస్తున్న చిన్నారెడ్డి అడ్డంకులు సృష్టించారు. సదరు బిల్లులు పాస్ చేయాలంటే రూ. 40 లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశారు.

Advertisement

చిన్నారెడ్డి డిమాండ్‌తో విసిగిపోయిన కాంట్రాక్టర్.. చివరకు రూ. 30 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మొత్తాన్ని రెండు విడతల్లో ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా మొదటి విడతగా రూ. 15 లక్షలను బుధవారం అందజేయాల్సి ఉంది. అయితే బాధితుడు ముందుగానే ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా వ్యూహంతో నిఘా పెట్టారు.

కూకట్‌పల్లి కార్యాలయంలో చిన్నారెడ్డి సూచన మేరకు.. ఆయన వద్ద పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్ ఆ లంచం సొమ్మును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. నిందితుల చేతుల నుండి కెమికల్ టెస్ట్ ద్వారా లంచం తీసుకున్నట్లు నిర్ధారించుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

ఈ ఘటన అనంతరం ఏసీబీ బృందాలు చిన్నారెడ్డి నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఈ భారీ కుంభకోణంలో కార్యాలయంలోని ఇతర అధికారులకు ఏమైనా సంబంధం ఉందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత నిందితులను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలేది లేదని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Also Read: ఖబడ్డార్.. మేం నక్సలైట్లనే ఎదురించాం.. పోలీసులకు, ఎమ్మెల్యేకు బండి సంజయ్ వార్నింగ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×