E-Paper
Advertisement

కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. స్కూటర్‌ను ఢీకొట్టిన లారీ, ఇద్దరు యువకులు మృతి!

కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. స్కూటర్‌ను ఢీకొట్టిన లారీ, ఇద్దరు యువకులు మృతి!
Advertisement

Kukatpally Accident: కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం నెలకుంది. సంతోషంగా క్రికెట్ ఆడేందుకు వెళ్తున్న ముగ్గురు స్నేహితుల జీవితాల్లో ఊహించని ప్రమాదం అంధకారాన్ని నింపింది. వేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ ముందు వెళ్తున్న స్కూటర్‌ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మహేష్ (17), లక్ష్మీ తేజ (17) అనే ఇద్దరు యువకులు తమ మరొక స్నేహితుడితో కలిసి ఆదివారం ఉదయం స్కూటర్‌పై క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు బయలుదేరారు. మార్గం మధ్యలో కూకట్‌పల్లి ప్రాంతంలోకి రాగానే, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ వీరి స్కూటర్‌ను సడన్‌గా ఢీకొట్టింది. లారీ వేగానికి స్కూటర్ అదుపుతప్పి కిందపడిపోవడంతో ప్రమాదం తీవ్ర రూపం దాల్చింది.

Advertisement

ఈ దారుణ ఘటనలో మహేష్, లక్ష్మీ తేజ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు లారీ చక్రాల కింద పడకుండా దూరంగా ఎగిరిపడటంతో తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఫ్లాప్ షో నుంచి హిస్టారికల్ విక్టరీ దాకా.. 37 రోజుల్లో ఢిల్లీని ఊపేసిన జెన్-జీ తుఫాన్!

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×