E-Paper
Advertisement

KTR Visit: సుప్రీంకోర్టుకైనా వెళ్తాం.. పేదల జోలికొస్తే వదిలేదే లేదు.. సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!

KTR Visit: సుప్రీంకోర్టుకైనా వెళ్తాం.. పేదల జోలికొస్తే వదిలేదే లేదు.. సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!
Advertisement

KTR Visit: ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న పేదల గుడిసెల తొలగింపు ఘటన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెలుగుమట్ల ప్రాంతంలో పర్యటించి బాధితులకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రభుత్వ చర్యల వల్ల నిరాశ్రయులైన పేదల పరిస్థితిని చూసి చలించిన ఆయన.. క్షేత్రస్థాయిలో పర్యటించి వారికి భరోసా కల్పించారు.

పర్యటనలో భాగంగా కేటీఆర్ కూల్చివేతలకు గురైన ఇళ్ల శిథిలాల మధ్యే నేలపై కూర్చుని బాధితులతో మాట్లాడారు. ఇళ్లు కూల్చివేసిన తీరును, ఆ సమయంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నారని కూడా చూడకుండా ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.

Advertisement

భూదాన్ భూముల సమస్యపై బాధితుల తరపున అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తామని.. పేదల ఇళ్లను కూల్చిన అధికార పార్టీని నిలదీస్తామని హామీ ఇచ్చారు. ‘ఎక్కడైతే ఇళ్లు కూల్చారో, అదే స్థలంలో మళ్ళీ గృహ నిర్మాణాలు చేపట్టి గృహ ప్రవేశాలు చేసేలా బాధ్యత తీసుకుంటాం’ అని బాధితులకు మాట ఇచ్చారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే అదే స్థలంలో పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని పేర్కొన్నారు.

అనంతరం కేటీఆర్ బాధితులు తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న అంబేద్కర్ భవన్ పునర్వాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. భూదాన్ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ పర్యటనతో వెలుగుమట్ల బాధితుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

Advertisement

Also Read: రేవంత్ సర్కార్‌పై కేంద్రానికి ఫిర్యాదు.. ఈటల సంచలన వ్యాఖ్యలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×