E-Paper
Advertisement

కాంగ్రెస్ ఫస్ట్ పార్ట్ అట్టర్ ప్లాప్.. సెకండ్ పార్ట్‌పై నమ్మకమే లేదు.. కేటీఆర్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ ఫస్ట్ పార్ట్ అట్టర్ ప్లాప్.. సెకండ్ పార్ట్‌పై నమ్మకమే లేదు.. కేటీఆర్ తీవ్ర విమర్శలు
Advertisement

KTR Slams Congress: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్ మాట్లాడారు. చీకట్లో చిరుదీపంలా కేసీఆర్ పార్టీని ప్రారంభించారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీ, టీఆర్ఎస్ మాత్రమే నిలబడి గెలిచాయని గుర్తు చేశారు. అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తాయని కేటీఆర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ జోస్యం చెప్పారు.

బీజేపీ, కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కార్యకర్తలు దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించాలని సూచించారు. హిట్లర్ తనకు స్ఫూర్తి అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి నుంచి ప్రజలు ఇంకేం ఆశించలేరని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తొలి అంకం పూర్తిగా విఫలమైందన్న కేటీఆర్.. రెండో భాగంపై కూడా ప్రజలకు నమ్మకం లేదని అన్నారు.

Advertisement

వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. 100 రోజుల్లోనే హామీలు నేరవేరుస్తామని.. బాండ్ పేపర్ రాసి ఇస్తామని కూడా ఎన్నికల సమయంలో చెప్పారని కేటీఆర్ అన్నారు. అయితే అధికారంలోకి వచ్చి చాలా నెలలు గడిచినా ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో 15 లక్షల పెళ్లిళ్లు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు, కాళేశ్వరం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు.

Also Read: గోల్డ్ షాప్‌లోకి చొరబడి.. పెప్పర్ స్ప్రే కొట్టి.. యువతులు వీరంగం!

Advertisement

రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్ బంధు’ మొదలుపెట్టారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ డబ్బును దోచుకుంటున్నారని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్‌కు అవమానం జరిగేలా వ్యవహరించిన వ్యక్తి రేవంత్ రెడ్డేనని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ నెల 25 తర్వాత వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని సందర్శిస్తానని కేటీఆర్ అన్నారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు ప్రత్యక్షంగా తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. మరో రెండేళ్లలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read: వాట్సప్ యూజర్స్‌కు అలర్ట్.. ఫార్వర్డ్ మెసేజ్‌లపై ఈ లేబుల్ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×