E-Paper
Advertisement

KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కవితను అందుకోసమే సస్పెండ్ చేశాం..

KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కవితను అందుకోసమే సస్పెండ్ చేశాం..
Advertisement

KTR: కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పార్టీలో చేర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పార్టీ నిర్ణయం తీసుకున్నాక ఇక మాట్లాడేది ఏముండదని అన్నారు. పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్, బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం: కేటీఆర్

Advertisement

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ తప్పు పట్టే సీబీఐకి రేవంత్ కాళేశ్వరం కేసు అప్పగించారని అన్నారు. ‘కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ నీటినే మూసీ పునరుజ్జీవం కోసం వాడుతున్నారు. పత్రికలలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ప్రకటన ఇచ్చారు. మల్లన్న సాగర్ దగ్గర ప్రారంభోత్సవం చేయకుండా.. గండిపేట దగ్గర మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేస్తున్నారు. గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్లా కాదా..? సీఎం సమాధానం చెప్పాలి.. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసినందుకు గానూ సీఎం క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ అన్నారు.

ప్రజల సొమ్ము ఎక్కడ వృథా అయ్యింది..?

Advertisement

‘కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని ప్రచారం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు ఎందుకు చేయలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు..? 94 వేల కోట్లు ఖర్చయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల స్కామ్ అని ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్ము ఎక్కడా వృథా అయిందని ముఖ్యమంత్రిని అడుగుతున్నా’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×