E-Paper
Advertisement

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం
Advertisement

KTR Resign Posters: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారపర్వం రేపటితో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచార రాజకీయం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో కేటీఆర్ రాజీనామా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కంటోన్మెంట్ అభివృద్ధి జాబితా ఇదిగో కేటీఆర్ రాజీనామాకు రెడీనా? అని పోస్టర్లలో రాసి ఉంది. జేబీఎస్-శామీర్ పేట్ కారిడార్ కు రూ.4263 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని పోస్టర్లపై రాసి ఉంది.

టీపీసీసీ జనరల్ సెక్రటరీ పృథ్వీ చౌదరి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తో కలిసి ప్యారడైజ్ జంక్షన్‌లో జరుగుతున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించారు. సెప్టెంబర్ 15న NH-44 వెంట పారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని కవర్ చేస్తూ ఈ ప్రాజెక్టు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయన్నారు.

ప్రాజెక్ట్ వివరాలు :

  • పొడవు: 5.400 కి.మీ.
  • భూసేకరణ: 55.52 ఎకరాలు
  • భూసేకరణ పరిహారం: రూ.357 కోట్లు
  • మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు (2 ప్రాజెక్టులతో సహా): రూ.5,700 కోట్లు (సుమారుగా)
Advertisement

జేబీఎస్-శామీర్ పేట్ కారిడార్ పనులు ప్రారంభం అయితే తాను రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో సవాల్ చేశారు. ఈ సవాల్ పై తాజాగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

కంటోన్మెంట్ లో కొనసాగుతున్న పనులు

  • ప్రధాన నీటి లైన్ల మార్పు
  • విద్యుత్ స్తంభాల తరలింపు
  • సరిహద్దు గోడల నిర్మాణం
  • లెవలింగ్, గ్రౌండ్ వర్క్ కార్యకలాపాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం తన వాగ్దానాలను అభివృద్ధిగా మారుస్తుందని కాంగ్రెస్ నేత, లింగోజిగూడ కార్పొరేటర్ దరపల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం జేబీఎస్-శామీర్ పేట్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమైనందున కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ సమక్షంలో అసెంబ్లీకి వచ్చి తమ రాజీనామాను సమర్పించాలని దరిపల్లి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×