E-Paper
Advertisement

KTR Press Meet : మెజార్టీ ఎందుకు తగ్గిందంటే.. గెలుపుపై కేటీఆర్ క్లారిటీ..

KTR Press Meet : మెజార్టీ ఎందుకు తగ్గిందంటే.. గెలుపుపై కేటీఆర్ క్లారిటీ..
Advertisement

KTR Press Meet : మునుగోడు గెలుపుతో కొత్త చరిత్ర లిఖించామని.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు టీఆర్ఎస్ వే అంటూ విజయ నినాదం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కారు గెలుపునకు కృషి చేసిన లెఫ్ట్ పార్టీలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి, ఆత్మ గౌరవానికి మునుగోడు ఓటర్లు పట్టం కట్టారని అన్నారు.

రోడ్ రోలర్, చపాతీ మేకర్ లాంటి కారును పోలిన గుర్తులకు సుమారు 6వేల ఓట్లు వచ్చాయని.. ఈసీతో కలిసి బీజేపీ కుట్ర చేసిందని.. లేదంటే తమ మెజార్టీ మరింత పెరిగి ఉండేదని కేటీఆర్ చెప్పారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డియే అయినా.. మునుగోడులో ఆట ఆడించిందంతా మోదీ, అమిత్ షాలే అన్నారు. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. తెలంగాణ సర్కారునూ కూలగొట్టాలని చూసిన బీజేపీకి మునుగోడు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు కేటీఆర్.

Advertisement

మునుగోడులో బీజేపీ పార్టీ వందల కోట్లు ఖర్చు చేసిందని.. ప్రచారం సమయంలో దొరికన డబ్బు అంతా బీజేపీ నాయకులవేనని గుర్తు చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను, 40 ఐటీ బృందాలను కేంద్రం మోహరించి ఎన్నికల్లో ఏదో జరిగిపోతున్నట్టు సీన్ క్రియేట్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఈటల రాజేందర్ వల్ల హుజురాబాద్ లో, రాజగోపాల్ రెడ్డి వల్ల మునుగోడులో ఎన్నికలు ధనమయం అయ్యాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అనేక ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేశారని.. బీజేపీ ఫేక్ పార్టీ అని అన్నారు కేటీఆర్.

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×