E-Paper
Advertisement

KTR : జగ్గారెడ్డితో కేటీఆర్ భేటీ .. ఈటలతో ముచ్చట్లు.. ఏంటీ సంగతి..?

KTR : జగ్గారెడ్డితో కేటీఆర్ భేటీ .. ఈటలతో ముచ్చట్లు.. ఏంటీ సంగతి..?
Advertisement

KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మంత్రి కేటీఆర్‌తో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి భేటీ అయ్యారు. కేటీఆర్‌ చాంబర్‌కు వెళ్లి కాసేపు ముచ్చటించారు. అసలు జగ్గారెడ్డి కేటీఆర్‌ చాంబర్‌కు ఎందుకు వెళ్లారు? ఆయన మళ్లీ కాంగ్రెస్‌ అధిష్టానంపై అలిగారా? లేక నియోజకవర్గ సమస్యలపై చర్చించడానికి వెళ్లారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

కేటీఆర్, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పిల్లలతో కలిసి తిరిగితే ఎలా అని కేటీఆర్ అన్నారు. టీ షర్టుతో వస్తే తప్పు లేదని జగ్గారెడ్డి అన్నారు. ఆ సమయంలో జగ్గారెడ్డితో TNGO అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉన్నారు. మీ ఇద్దరికీ స్నేహం ఎక్కడ కుదిరిందని కేటీఆర్ అడిగారు. మాది ఒకే కంచం ఒకే మంచం అని మామిళ్ల సమాధానం ఇచ్చారు. అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తావా అని కేటీఆర్ ప్రశ్నించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తానని మామిళ్ల స్పష్టం చేశారు. అయితే మన దగ్గరకు పట్టుకొస్తామంటూ ఆసక్తికర కామెంట్ చేశారు.

Advertisement

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్ద కేటీఆర్ వెళ్లారు. ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలోఇరువురు నేతలు ఒకరినొకరు హత్తుకున్నారు. 10 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. వారిద్దర మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనే చర్చ నడుస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×