E-Paper
Advertisement

KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?

KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?
Advertisement

KCR With KTR: బీఆర్ఎస్‌ పార్టీకి కాలం కలిసిరాలేదా? గ్రహాలు అనుకూలించ లేదా?  మళ్లీ యాగానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారా? అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయా? తొలి ఏడాది కేటీఆర్ వంతు కాగా, రెండో ఏడాది కేసీఆర్-హరీష్‌రావు వంతయ్యిందా? న్యాయస్థానం తీర్పు వచ్చేవరకు వెయిట్ చేస్తారా? ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారా? ఫామ్‌హౌస్‌లో కేసీఆర్-కేటీఆర్ ఏయే అంశాలు చర్చకు వచ్చాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు షాకయ్యారు. కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకోవైపు హరీష్‌రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాజకీయంగా, న్యాయపరంగా చేయాల్సివన్నీ ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. ఇక మిగిలింది ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

Advertisement

తాజాగా సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కి వెళ్లారు కేటీఆర్. అధినేత కేసీఆర్-కేటీఆర్ మధ్య కాళేశ్వరం అంశంపై చర్చ జరిగింది. న్యాయస్థానంలో పిటిషన్ వేసిన విషయాన్ని పెద్దాయన దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు. మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరుగుతుందని, అనుకూలంగా నిర్ణయం వస్తే ఓకేనని, రాకుంటే పరిస్థితి ఏంటన్నది అప్పుడు ఆలోచిద్దామని అన్నట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే చేసేదేమీ లేదని అన్నారట. ఈ అంశంపై సీబీఐకి ప్రభుత్వం లేఖ రాయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత కొంత సమయం పడుతుంద న్నారు. ఈలోగా హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ALSO READ: స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని భావిస్తున్నారట బీఆర్ఎస్ పెద్దలు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశం మనకు మైలేజ్ వచ్చేవిధంగా  ప్లాన్ చేయాలని భావిస్తున్నారట. ఈ వారం లేకుండా వచ్చేవారంలో స్థానిక సంస్థల ఎన్నికల గంట మోగనుంది. దీనిపై ఆందోళనలు చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుండగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు యాగం చేస్తే బాగుంటుందని, కొంతైనా రిలీఫ్ లభిస్తుందని కొందరు నేతలు చెబుతున్నారు. ఈ నెల మూడోవారం నుంచి దేవీ నవరాత్రులు మొదలుకానున్నాయి. ఆలోగా యాగం చేస్తే మంచి ఫలితాలు రావచ్చని అంటున్నారు. మొత్తానికి మంగళవారం హైకోర్టు తీర్పు తర్వాత వేగంగా అడుగులు వేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×