E-Paper
Advertisement

KTR: కేంద్రంలో 2 కోట్లు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్.. అన్ని వట్టి మాటలేనా..? కేటీఆర్ ఫైర్

KTR: కేంద్రంలో 2 కోట్లు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్.. అన్ని వట్టి మాటలేనా..? కేటీఆర్ ఫైర్
Advertisement

KTR: కేంద్రంలో ప్రధాని మోదీ, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఒకేరకంగా ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరూ కలిసి రాహుల్‌ గాంధీకి పెద్ద షాక్‌ ఇవ్వటం ఖాయమని వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలని ఇస్తానని ప్రధాని మోదీ, రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలని సీఎం రేవంత్‌‌రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఫైరయ్యారు. తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.

అక్కడ బడే భాయ్.. ఇక్కడ ఛోటే భాయ్..

Advertisement

‘బీజేపీకి, కాంగ్రెస్ లకు చెరో ఎనిమిది ఎంపీలుండి రాష్ట్రానికి ఏం చేశారు..? రేవంత్ రెడ్డికి  రక్షణ కవచంలా బీజేపీ పనిచేస్తోంది.. రేవంత్ ప్రతి తప్పును బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారు.. కేంద్రంలో రేవంత్ బావమరిదిని బీజేపీ కాపాడితే.. తెలంగాణలో బీజేపీ ఎంపీకి రేవంత్ రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారు. మోదీ, రేవంత్ ఇద్దరూ ఒక్కటే బడే భాయ్, ఛోటే భాయ్.. మధ్యలో రాహుల్ గాంధీ ఆటలో అరటి పండు అయ్యాడు. భవిష్యత్తులో రాహుల్ గాంధీకి రేవంత్ దెబ్బకొట్టడం ఖాయం.. ప్రశ్నించే వారిపై మోదీ ఈడీనీ పంపితే.. రేవంత్ ఏసీబీ కేసులు పెడుతాడు’ అని కేటీఆర్ మండిపడ్డారు.

ALSO READ: Jobs in RRB: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 జీతం.. డోంట్ మిస్

Advertisement

రిపేర్ చేయాల్సిన బాధ్యత లేదా..?

‘యూరియా కోసం రైతులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడుతున్నారు. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దని బీజేపీ నేతలు అంటున్నారు. కిందనున్న ఆంధ్రా, తమిళనాడుకు గోదావరి నీళ్లు ఇస్తారంట. తెలంగాణ హిమాలయాలు కరిగించిన నీళ్లు ఇస్తారంట. అధికారంలోకి వస్తే పథకాల వరద పారిస్తామన్నారు. ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయా..? కేసీఆర్ రూ.73వేల కోట్ల రైతు బంధు వేశారు. ఇప్పుడు టకీటకీమని రైతుబంధు డబ్బులు పడుతున్నాయా..? రైతు బంధు పోయింది.. బోనస్ ఆగిపోయింది.. దళితబంధు రూ.12లక్షలు ఇస్తామన్నారు.. ఒక్కరికైనా ఇచ్చారా..? ఇదేనా రేవంత్ ప్రభుత్వం తెచ్చిన మార్పు’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘కుంగిన పిల్లర్లను రిపేర్ చేయాల్సిన బాధ్యత లేదా..? రెండు పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేశారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ: Intelligence Bureau: ఐబీలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో.. సూపర్ ఛాన్స్ ఇది..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×