E-Paper
Advertisement

డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు

డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు
Advertisement

వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంకర్ గౌడ్ మృతిని కేవలం ఆత్మహత్యగా పరిగణించలేమని.. ఇది ముమ్మాటికీ రేవంత్ సర్కార్ చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న అన్యాయం.. తీరని ద్రోహం కారణంగానే మనస్తాపం చెంది శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు.

సంస్థ పరిరక్షణకు.. తోటి కార్మికుల హక్కుల సాధనకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని కనీసం నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు.. ఆర్టీసీ కార్మికులు.. కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు డిపో వద్ద నివాళులు అర్పించే అవకాశం కల్పించాలన్నారు. కాంగ్రెస్ సర్కారు రాక్షసత్వం వల్ల కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మళ్లీ పాత ఉద్యమ నాటి దృశ్యాలు.. ఆత్మబలిదానాలు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో సవాలక్ష హామీలిచ్చిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. అందుకే కార్మిక లోకం తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉందని చెప్పారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలు మానుకుని.. కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలన్నారు. ఇచ్చిన హామీలను.. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేయడం తెలంగాణ చరిత్రలో చీకటి రోజు అని కేటీఆర్ అభివర్ణించారు. ఇంతటి విషాదకర సంఘటనలు జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని.. మీ పోరాటాలకు బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నిరంకుశ సర్కారు మెడలు వంచి కార్మికుల న్యాయమైన హక్కులను సాధించే వరకు అందరం కలిసి పోరాడుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ALSO READ: సీఎం చంద్రబాబు హామీపై దుష్ప్రచారం.. ఖండించిన మంత్రి లోకేష్, చర్యలు తప్పవని హెచ్చరిక

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×