E-Paper
Advertisement

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్.. అన్నివర్గాలకు మోసం జరిగిందని వ్యాఖ్య

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్.. అన్నివర్గాలకు మోసం జరిగిందని వ్యాఖ్య
Advertisement

Hyderabad: తెలంగాణలో అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ మాటల వేడి తీవ్రమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తాను మారిన మనిషి అని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఆయన దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణుడని ఆరోపించారు.

సీఎం రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్

Advertisement

మంగళవారం తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్లలో అన్నివర్గాల ప్రజలను మోసపోయారని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో వందకు పైగానే విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి ఏ మాత్రం చలనం లేదన్నారు. కనీసం విద్యార్థుల మరణాలపై విచారం వ్యక్తం చేయలేదన్నారు. కేవలం పైశాచిక ఆనందం గురించి మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

Advertisement

అన్నివర్గాలకు ప్రభుత్వం మోసం చేసిందని వ్యాఖ్య

విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజల ఇబ్బందులు ముఖ్యమంత్రికి వినోదంగా కనిపిస్తున్నాయా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నలు రైజ్ చేశారు. విద్యా వ్యవస్థ గురించి ప్రస్తావించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కంటిన్యూ చేసిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేసిందన్నారు.

బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల వేలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిద్ర పోతోందని ఘాటుగా విమర్శించారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు కేటీఆర్.  రైతుబంధు పథకం పూర్తిగా ఆగిపోయిందన్నారు.

ALSO READ: రిటైర్డ్ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రూ.వెయ్యి కోట్ల బకాయిలు విడుదల

విత్తనాలు, యూరియా దొరకని పరిస్థితి రైతులకు ఏర్పడిందన్నారు. ధాన్యం, శనగలు వంటి పంటలను కొనుగోలు చేయలేదన్నారు. ఫలితంగా రైతులు రోడ్ల పైకి వస్తున్నారని ధ్వజమెత్తారు. బోనస్ ఇవ్వాలనే సాకుతో కొనుగోలు కేంద్రాలను మూసివేసి రైతుల కడుపు కొడుతున్నారని అన్నారు. రైతులకు అందాల్సిన సాయాన్ని నిలిపి వేసి రాష్ట్ర సంపదను ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×