E-Paper
Advertisement

KTR Shocking Comments: పోరాట పంథాలో కథం తొక్కుదాం.. కేసీఆర్‌ని ప్రజలే కాపాడుకుంటారు.. కేటీఆర్ సంచలన ట్వీట్

KTR Shocking Comments: పోరాట పంథాలో కథం తొక్కుదాం.. కేసీఆర్‌ని ప్రజలే కాపాడుకుంటారు.. కేటీఆర్ సంచలన ట్వీట్
Advertisement
KTR Shocking Comments
KTR Shocking Comments

KTR Shocking Comments:తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కారు దిగి పలువురు అగ్రనేతలు హస్తం గూటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారిన కొద్ది రోజులకే.. ఎంపీ కేకే, మేయర్ విజలక్ష్మి కేసీఆర్‌కు గట్టి షాక్ ఇచ్చారు. కేసీఆర్ తో సమావేశం అయిన కాసేపటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు రావడం సంచలన రేపాయి. ఇటు కేకే పార్టీ మారుతున్న విషయం తెలిసిందో లేదో.. మరోవైపు వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ మారగా.. ఎన్నికలలోపు మరికొంత మంది అభ్యర్థులు జంప్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే, పార్టీలో నెలకొన్న పరిస్థితులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా స్పందించారు.

Also Read: దాదాపుగా కారు ‌‌‌‌‌ ఖాళీ! భారీ కుదుపు, మరొకరు..?

Advertisement

పార్టీలు మారుతున్న అగ్ర నేతల తీరుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కేసీఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారుచేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×