E-Paper
Advertisement

KTR With Media: కాంగ్రెస్ ప్లాన్ బయటకు.. ఇకపై వారికి డోర్స్ క్లోజ్‌, మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్

KTR With Media: కాంగ్రెస్ ప్లాన్ బయటకు.. ఇకపై వారికి డోర్స్ క్లోజ్‌, మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్
Advertisement

KTR With Media: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఆ నేతలకు డోర్స్ క్లోజ్ అయినట్టు మనసులోని మాట బయపెట్టారు.

మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్

Advertisement

బీఆర్ఎస్ కొత్త కొత్త ప్రణాళికలు వేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో కాస్త పర్వాలేదని పెంచిన ఆ పార్టీ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో  సత్తా చాటేందుకు ఉవ్విల్లూరు తోంది. ఇప్పటి నుంచి ఆ పార్టీ రకరకాల ప్లాన్స్ చేస్తోంది.  ఈ క్రమంలో కొత్త బాంబు పేల్చారు మాజీ మంత్రి కేటీఆర్.  సోమవారం ఉదయం మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. కొన్ని కీలక విషయాలు బయటపెట్టారు.

ఫార్ముల ఈ-కారు రేస్, ఫోన్​ ట్యాపింగ్​ వంటి కేసుల్లో కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశముందని వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్న వేళ, అసలు విషయం బయటపెట్టారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికలకు తాను లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. తాను లోపలున్నా, వ్యవహారాలను పార్టీ  చూసుకుంటుం దన్నారు. ఈ విషయంలో తాను భయపడేది లేదన్నారు.

Advertisement

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డోర్స్ క్లోజ్

అదే సమయంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నోరు విప్పారు. ఈ వ్యవహారంపై స్పీకర్ ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మహా అయితే దానం మాత్రమే ఉన్నారు. పార్టీ వదిలి వెళ్లిన నేతలను మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదని, వారికి డోర్స్ క్లోజ్ అయ్యాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉందని మనసులోని మాట బయపెట్టారు.

పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీకి మంచి ఫలితాలు సాధించిందని, ఈ క్రమంలో అధికార పార్టీకి భయం మొదలైందన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలను ఆలస్యం చేస్తూ వస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్‌ని కాదని బీజేపీలోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో అత్యధిక సర్పంచ్ సీట్లు గెలిచామన్నారు. నేతల బలం లేకున్నా  అధికంగా గెలిపించుకున్నామని వెల్లడించారు.

ALSO READ:  సభా సమరం.. తగ్గేదెవరు.. నెగ్గేదెవరు?

ఏపీలో జగన్ మాదిరిగా నేతలను అరెస్టు చేసి తప్పు చేయమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.  తమను అరెస్టు చేస్తారంటూ బీఆర్ఎస్ చెబుతూ వస్తోంది. ఈ లెక్కన బీఆర్ఎస్ అసలు గేమ్ మొదలుపెట్టినట్టు చెబుతున్నారు కొందరు నేతలు. ఇదిలావుండగా తాము బీఆర్ఎస్‌లో ఉన్నామని పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్‌కి చెప్పడం, ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించడం జరిగిపోయింది.

ఐదుగురి అనర్హత పిటిషన్లను స్పీకర్​ ఇటీవల తోసిపుచ్చారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేల విచారణ పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్‌కు దూరంగా కూర్చొన్నారు. అసెంబ్లీలో ట్రెజరీ వైపు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల సంజయ్‌లు కూర్చున్నట్లు సమాచారం.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×