E-Paper
Advertisement

కేటీఆర్ బర్త్‌డే వేళ దిమ్మతిరిగే ట్విస్ట్.. హైదరాబాద్ రోడ్లపై ‘కరప్షన్ కింగ్’ ఫ్లెక్సీల రగడ!

కేటీఆర్ బర్త్‌డే వేళ దిమ్మతిరిగే ట్విస్ట్.. హైదరాబాద్ రోడ్లపై ‘కరప్షన్ కింగ్’ ఫ్లెక్సీల రగడ!
Advertisement

KTR Birthday: హైదరాబాద్ నగరం మరోసారి పొలిటికల్ హీట్‌తో రగిలిపోతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేళ సోషల్ మీడియా అంతా శుభాకాంక్షలతో నిండిపోతే, సిటీ వీధుల్లో మాత్రం ఊహించని దృశ్యాలు కనిపించాయి. కేటీఆర్‌కు విషెస్ చెప్పేందుకు రోడ్లెక్కిన అభిమానులకు, సాధారణ జనానికి దిమ్మతిరిగేలా వెలసిన కొన్ని ఫ్లెక్సీలు ఇప్పుడు నగరంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

‘కరప్షన్ కింగ్’అంటూ వెలసిన బ్యానర్లు

Advertisement

హైదరాబాద్‌లోని శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాం క్లబ్ వంటి కీలక ప్రాంతాల్లో అర్ధరాత్రికి అర్ధరాత్రి భారీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ‘హ్యాపీ బర్త్ డే కరప్షన్ కింగ్ KTR’ అంటూ ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లు వెళ్లొచ్చే ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగడుతూ ఈ పోస్టర్లను రూపొందించడం గమనార్హం.

‘బాప్ ఆఫ్ పేపర్ లీక్’ఆరోపణలు

Advertisement

ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారాన్ని ఈ ఫ్లెక్సీలలో ప్రధానంగా ప్రస్తావించారు. కేటీఆర్‌ను ‘బాప్ ఆఫ్ పేపర్ లీక్’ అని అభివర్ణిస్తూ.. అప్పట్లో జరిగిన లీకుల వల్ల సుమారు 27 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఘాటుగా రాసుకొచ్చారు. ‘మీ పాలనలో జరిగిన పేపర్ లీకులకు, ఆ విద్యార్థుల చావులకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?’ అంటూ నేరుగా కేటీఆర్‌నే ప్రశ్నించారు.

Also Read: కేటీఆర్‌కు బర్త్‌డే కానుకగా సన్నబియ్యం.. మెట్టు సాయి కుమార్ సంచలన వ్యాఖ్యలు

రాజకీయ దుమారం.. కాంగ్రెస్ సెటైర్లు

ఈ ఫ్లెక్సీలను అధికారికంగా ఎవరు వేశారనేది ఎవరూ క్లెయిమ్ చేసుకోకపోయినప్పటికీ, ఇది కాంగ్రెస్ నేతల పనియేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఇచ్చే ‘స్పెషల్ గిఫ్ట్’ ఇదంటూ కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నాయి. అంతేకాకుండా, గతంలో పరీక్షల అక్రమాల వల్ల 21 మంది విద్యార్థుల మరణాలకు బీజేపీనే కారణమంటూ మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బర్త్‌డే రోజే జరిగిన ఈ పోస్టర్ వార్ రాజధాని రాజకీయాల్లో పెద్ద తుఫాన్‌నే సృష్టించింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×