E-Paper
Advertisement

KTR: ఏఐసీసీకి ఏటీఎంలా మారిన తెలంగాణ: కేటీఆర్

KTR: ఏఐసీసీకి ఏటీఎంలా మారిన తెలంగాణ: కేటీఆర్
Advertisement

KTR: ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని తాము గతంలో అనేకమార్లు హెచ్చరించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా ఒప్పుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్టానానికి ధారపోస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.

ఇచ్చిన 420 హామీలు అమలు

రైతన్నలకు, మహిళలకు, యువతకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన 420 హామీల అమలు విషయానికి వస్తే ప్రభుత్వం వద్ద రూపాయి నిధులు లేవని సాకులు చెబుతున్నారని విమర్శించారు. అభివృద్ధికి నిధులు లేవంటున్న సర్కారు, కేవలం రెండేళ్ల కాలంలోనే మూడు లక్షల కోట్ల రూపాయల భారీ అప్పులు తెచ్చిందని, కానీ రాష్ట్రంలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ప్రజా ప్రయోజనాలకు వాడకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Also Read: Inter Exams IN AP: ఏపీలో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! 10 లక్షల మందికి పైగానే

ఢిల్లీకి సంచులు..

మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను, లగచర్లలో గిరిజనుల భూములను, చివరకు హెచ్‌సీయూ విశ్వవిద్యాలయ భూములను కూడా వదలడం లేదని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ పేరిట పరిశ్రమల భూములను ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర వనరులను లూటీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను దోచుకోవడం, సొంతానికి దాచుకోవడం, తన పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి సంచులు మోయడమే రేవంత్ రెడ్డి ఏకైక అజెండా అని ధ్వజమెత్తారు. ప్రజల కష్టార్జితాన్ని దారి మళ్లిస్తూ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement

Also Read: Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై బాలు సెటైర్.. మనోజ్ కు టెన్షన్.. ఎమోషనల్ సీన్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×