E-Paper
Advertisement

KTR Allegations: ‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం’.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

KTR Allegations: ‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం’.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్
Advertisement

KTR Allegations: ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యకాండకు దిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఎక్స్ వేదికగా గురువారం ఫైర్ అయ్యారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఘోరమైన పరిపాలనా వైఫల్యాలను మూటగట్టుకున్నదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు.

అడుగడుగునా అధికార దుర్వినియోగం

ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కు కొండంత బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మొదలైన పరాభవం, పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే అడుగడుగునా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.

Advertisement

మూల్యం చెల్లించుకోకతప్పదు

అక్రమంగా లూటీచేసిన వేలకోట్ల ప్రజాధనంతో, ప్రజాతీర్పునే మార్చాలన్న ఈ కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ అన్నారు. పోలీసుశాఖను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపుల పర్వానికి, దాడులకు రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను, మొత్తంగా పరిపాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం రేవంత్ రెడ్డిని ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటదన్నారు.

హరీశ్ రావు సైతం..

Advertisement

అంతకుముందు హరీశ్ రావు సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు అడుగడుగునా ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు కాంగ్రెస్ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజల తీర్పును మార్చలేరని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Naagin Rumours: పాములా మారిన యువతి? బెడ్‌పై 5 అడుగుల కుబుసం.. గ్రామంలో తీవ్ర గందరగోళం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×