E-Paper
Advertisement

Konda Surekha: రాహుల్ ఇంటికి వెళ్లి అడ‌గండి.. ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ కౌంట‌ర్!

Konda Surekha: రాహుల్ ఇంటికి వెళ్లి అడ‌గండి.. ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ కౌంట‌ర్!
Advertisement

Konda Surekha: రాహుల్ గాంధీ కులం ఏంటో, మ‌తం ఏంటో చెప్పాల‌ని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి కొండా సురేఖ కౌంట‌ర్ ఇచ్చారు. కులగ‌ణ‌న ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కులగణన ఫారమ్ తీసుకెళ్తే తన కులమేంటో రాహుల్ చెబుతారని స్ప‌ష్టం చేశారు. కులాలు, మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టేదే బీజేపీ అని ఫైర్ అయ్యారు. దేశంలోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలంగాణ ప్ర‌భుత్వం స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే చేప‌డుతోంద‌ని తెలిపారు. బ్రిటిష్ కాలంలో కుల‌గ‌ణ‌న జ‌రిగితే మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గలేద‌న్నారు.

Also read: ఫార్ములా ఈ రేసింగ్ నిధులు గోల్‌మాల్.. దూకుడు పెంచిన ఏసీబీ, వారికి శిక్ష తప్పదా?

Advertisement

కాబ‌ట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని రాహుల్ గాంధీ తెలంగాణ‌లో కుల‌గ‌ణ‌న‌ అనౌన్స్ చేశార‌న్నారు. అధికారంలోకి వ‌చ్చాక అమ‌లు చేసి తీరుతామ‌ని ఛాలెంజ్ చేశార‌ని గుర్తు చేశారు. ఆ ఛాలెంజ్ స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి ఓ ల‌క్ష్యంతో స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న స‌ర్వే చేప‌ట్టార‌ని చెప్పారు. ద‌శాబ్దాల కాలంగా ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకే సీఎం క‌ల‌గ‌ణ‌న ప్రార‌భించార‌న్నారు. ప్రొఫార్మాలో పొందుప‌రిచినట్టుగా 56 ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి స‌ర్వే చేసేవాళ్ల‌కు ట్రైనింగ్ ఇచ్చిన‌ట్టు తెలిపారు. ఒక్కొక్క‌రు 150 ఇండ్ల‌ను స‌ర్వే చేయాల‌న్నారు. స‌ర్వే చేసిన డేటా ఎక్క‌డా లీక్ అవ్వ‌ద‌ని హామీ ఇచ్చారు.

ఏ ప‌థ‌కం అమ‌లు చేయాల‌న్నా కుల‌గ‌ణ‌న‌లోని జ‌నాభా శాతం ఆధారంగా అమ‌లు చేస్తామ‌న్నారు. సామాజిక స‌మన్యాయం జ‌ర‌గాలంటే ఈ స‌ర్వే క‌చ్చితంగా చేయాల్సిందేన‌ని చెప్పారు. ఇంత కాలం బాధ‌ప‌డ్డ బీసీలు కుల‌గ‌ణ‌న త‌ర‌వాత ఎవ్వ‌రినీ చేయి చాచి అడ‌గాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఉన్నంత వ‌రకు ఈ స‌ర్వే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం వ్య‌క్తుల డేటాను అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్నారు. నిన్న రాహుల్ గాంధీ ఎంతో గ‌ర్వంగా తెలంగాణ‌లో కుల‌గ‌ణ‌న గురించి మాట్లాడార‌ని అన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×