E-Paper
Advertisement

Komatireddy Venkat Reddy: రెండేళ్లలో నల్గొండ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy: రెండేళ్లలో నల్గొండ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Advertisement

Komatireddy Venkat Reddy: రానున్న రెండేళ్లలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ శివాజీ నగర్, 41వ డివిజన్ పద్మావతి కాలనీలలో రూ. 80 లక్షలతో నిర్మించనున్న కొత్త పార్కులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి మంత్రి మాట్లాడారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటేషన్ నిర్వహణ, పార్కుల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెప్పారు.

Also ReadNissan Gravite: జస్ట్ రూ. 5.65 లక్షలకే నిస్సాన్ గ్రావైట్‌ కాంపాక్ట్.. మార్కెట్ లోకి లాంచ్ చేసిన కంపెనీ!

రూ. 20 కోట్లతో న్యాక్ బిల్డింగ్

Advertisement

ఇకపై ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు వారి డివిజన్లలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.టౌన్ లో విద్యుత్ లో వోల్టేజి సమస్య శాశ్వత పరిష్కారానికి సబ్ స్టేషన్ ల నిర్మాణంతోపాటు అవసరమైన విద్యుత్తు లైన్లను షిఫ్ట్ చేస్తున్నట్లు తెలిపారు. రూ. 20 కోట్లతో న్యాక్ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతుండగా రూ. 84 కోట్లతో చేపట్టిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రం పనులు కంప్లీట్ అయినట్లు చెప్పారు.

రూ. 900 కోట్లతో ఔటర్ రింగ్

రూ. 900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. రానున్న పదేళ్లలో నల్లగొండలో ఇండస్ట్రియల్ హబ్ కు కేరాఫ్ గా మారుస్తామని చెప్పారు. పేదల అభివృద్ధి లక్ష్యంగా పాలన అందిస్తామని పేర్కొన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ఎస్ ఎల్ బీసీ నిర్మాణంలో భాగంగా లైనింగ్ పనులు మొదలైనట్లు చెప్పారు.

Advertisement

Also  Read: Varanasi film: వారణాసి సినిమాలో కన్నడ స్టార్ హీరో..పక్కాగా ప్లాన్ చేసిన రాజమౌళి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×