E-Paper
Advertisement

Komatireddy Venkat Reddy: నేనే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు మూసేస్తా: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy:  నేనే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు మూసేస్తా: మంత్రి కోమటిరెడ్డి
Advertisement

Komatireddy Venkat Reddy: తనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం వస్తే విద్యావ్యవస్థను మొత్తం మార్చేస్తానంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలను మూసేస్తానన్నారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల దోపిడీ ఎక్కువైందని, విద్యను అమ్ముకుంటున్నారన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడలో ‘కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.

కార్పొరేట్ స్కూళ్లు బంద్ చేయిస్తా

“అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలి. టీచర్లు కూడా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఎక్కువ ఉన్నారు. నారాయణ కాలేజీ, ప్రభుత్వ కాలేజీ పొండి.. అక్కడ డిగ్రీ చేసిన వాళ్లుంటారు. ఇక్కడ పీహెచ్‌డీ చేసి.. గ్రూప్ నకు ప్రిపేర్ అయిన వాళ్లుంటారు. ఏదైనా ఉద్యోగం రాక లెక్చరర్ అయిన వాళ్లుంటారు. కానీ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వెంట పడుతున్నారు. ప్రైవేట్ కాలేజీల బట్టి వల్ల వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నాకెప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వస్తే ఈ కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలను బంద్ చేయించడం ఖాయం” – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

విద్య వ్యాపారం కాదు

Advertisement

“అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయమైతది. ఎవరైన అడ్మిషన్ కావాలని నా దగ్గరకు వస్తే.. నారాయణ, శ్రీ చైతన్య కు కాల్ చేస్తే అడ్మిషన్ ఫీజు రూ.3 లక్షలు అంటారు. మీకు కాబట్టి రూ.2 లక్షలు చేస్తామంటారు. అసలు ఫీజు రూ.2 లక్షలు, కోమటిరెడ్డి ఫోన్ చేస్తారని ముందే తెలుసుకుని చెప్పడం రూ.3 లక్షలు చెబుతారు. ఎంత దొంగలంటే వాళ్లు. నాకు కోపం వస్తుంది ఇలాంటి చూస్తుంటే. విద్య వ్యాపారం కాదు. 25 శాతం సీట్లు పేదవాళ్లకు ఇవ్వాలని చట్టం ఉంది. కానీ ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు” – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×