E-Paper
Advertisement

Rajgopal Reddy: రేవంత్ రెడ్డిది విజనరీ పాలన.. గొర్రెలు.. బర్రెలు కాదు.. మాకు చదువులు కావాలన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Rajgopal Reddy: రేవంత్ రెడ్డిది విజనరీ పాలన.. గొర్రెలు.. బర్రెలు కాదు.. మాకు చదువులు కావాలన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Advertisement

Rajgopal Reddy: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ నిర్మాణానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భూమి పూజ చేశారు. సుమారు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ పాఠశాల భవన సముదాయం ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును మార్చబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా దక్షతను, విద్యా రంగంపై ఆయనకున్న మక్కువను కొనియాడారు. తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన చదువు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో విద్యా.. వైద్య రంగాలను పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి.. సీమాంధ్ర కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చారని మండిపడ్డారు. “గత పాలకులు గొర్రెలు.. బర్రెలు.. చేప పిల్లలు పంపిణీ చేస్తూ ప్రజలను ఆ వర్గాలకే పరిమితం చేయాలని చూశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులతో అత్యాధునిక రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోంది. పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా పొందాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం” అని ఆయన వివరించారు. ఈ గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రికి మునుగోడు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

ప్రస్తుతం తెలంగాణలో 76 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారని.. అందులో 44 లక్షల మంది ప్రైవేట్ సెక్టార్‌లోనే చదువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య మొత్తం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయిందని.. కనీసం 50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివేలా బడ్జెట్‌లో 10 నుండి 15 శాతం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

మునుగోడు నియోజకవర్గ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో 330 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ.. కేవలం 9,700 మంది విద్యార్థులు మాత్రమే ఉండటం విద్యా ప్రమాణాల పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్నప్పటికీ మునుగోడు అభివృద్ధిలో వెనుకబడిందని.. నల్గొండ జిల్లాలోనే ఇది అత్యంత వెనుకబడిన ప్రాంతమని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి వేస్తున్న మొట్టమొదటి అడుగు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని.. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచామని.. అయితే భోజనంలో నాణ్యత విషయంలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లాను రాష్ట్ర రాజకీయాల్లో ‘టైగర్ జోన్’గా అభివర్ణించిన రాజగోపాల్ రెడ్డి.. ఇది పోరాటాల ఖిల్లా అని.. రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లా అని గర్వంగా ప్రకటించారు. విద్యా రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి.. దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపు చూసేలా చేస్తామని ఆయన ఉద్ఘాటించారు.

Read Also: TTD Chairman BR Naidu: డీప్ ఫేక్ వీడియోలతో ప్రచారం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం, ఆపై ఫిర్యాదు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×