E-Paper
Advertisement

Neopolis Water: నియోపోలిస్ నెక్స్ట్ లెవల్ ప్లాన్.. 30 ఏళ్ల వరకు నీటి కష్టాలకు చెక్!

Neopolis Water: నియోపోలిస్ నెక్స్ట్ లెవల్ ప్లాన్.. 30 ఏళ్ల వరకు నీటి కష్టాలకు చెక్!
Advertisement

Neopolis Water: హైదరాబాద్ నగర విస్తరణలో భాగంగా కోకాపేట నియోపోలిస్ (Neopolis) ప్రాంతం అంతర్జాతీయ స్థాయి హబ్‌గా ఎదుగుతోంది. ఇక్కడ పెరుగుతున్న జనాభా , భారీ భవనాల అవసరాలకు అనుగుణంగా తాగునీటి కొరత లేకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జలమండలికి 3.95 ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా, మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసింది.

ఈ కేటాయించిన స్థలంలో అత్యాధునికమైన సంప్ (Sump), పంప్ హౌస్, సెక్షన్ ఆఫీస్, గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ (GLSR),మురుగు నీటి శుద్ధి ప్లాంట్ (STP) పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులోని అతిపెద్ద విశేషం ఏమిటంటే.. నియోపోలిస్ నుంచి గ్రావిటీ ద్వారా మెహదీపట్నం, షేక్ పేట వంటి దిగువ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయవచ్చు. దీనివల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. గోదావరి జలాలను ఎటువంటి అదనపు పంపింగ్ ఛార్జీలు లేకుండా నేరుగా బోజగుట్ట రిజర్వాయర్ కు తరలించే అవకాశం ఏర్పడుతుంది. ఇది ఆర్థికంగా జలమండలికి పెద్ద వెసులుబాటు.

Advertisement

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ (ఫేజ్-II & III) ద్వారా అదనంగా 300 ఎంజీడీ నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నీటితో కేవలం తాగునీటి అవసరాలే కాకుండా.. మూసీ నది పునరుజ్జీవం కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపనున్నారు.

ఈ సమగ్ర ప్రణాళిక వల్ల పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ ,పరిసర ప్రాంతాలకు వచ్చే 30 ఏళ్ల వరకు నీటి కష్టాలు తీరనున్నాయి. నియోపోలిస్ లేఅవుట్ లో ప్రస్తుతం జరుగుతున్న పనులు పూర్తయితే.. ఆ ప్రాంతం స్వయం సమృద్ధి కలిగిన మోడల్ టౌన్‌షిప్‌గా మారుతుంది.

Advertisement

Also Read: ఏసీబీ ట్రాప్.. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం లంచం తీసుకుంటూ హోంగార్డ్ అరెస్ట్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×