E-Paper
Advertisement

Telangana Politics: ఎట్టకేలకు ఉత్కంఠకు తెర.. గవర్నర్ కోటాలో అజారుద్దీన్-కోదండరామ్‌లు, కాకపోతే

Telangana Politics: ఎట్టకేలకు ఉత్కంఠకు తెర.. గవర్నర్ కోటాలో అజారుద్దీన్-కోదండరామ్‌లు, కాకపోతే
Advertisement

Telangana Politics: తెలంగాణలో ఎమ్మెల్సీల భర్తీ ఉత్కంఠకు ఫుల్‌స్టాప్ పడింది. మంత్రి అజారుద్దీన్, కోదండరాంలను గవర్నర్ కోటాలో మండలి సభ్యులుగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా. ఈ నియామకాలకు సంబంధించి కేసు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రభుత్వం జారీ చేసిన స్పష్టం చేసింది.

తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ ఉత్కంఠకు తెర

Advertisement

తెలంగాణలో మంత్రి అజారుద్దీన్, కోదండరాంలను శాసనమండలి సభ్యులుగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నామినేట్ చేశారు. అయితే ఈ నియామకాలు న్యాయస్థానం తుది తీర్పునకు లోబడి ఉండనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల పదవీకాలం మూడేళ్ల కిందట ముగియడంతో ఖాళీలను వీరితో భర్తీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీల నామినేషన్లను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 19న లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీలో ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

గవర్నర్ కోటాలో మండలికి అజారుద్దీన్-కోదండరామ్‌లు

ఈ నియామకం అజారుద్దీన్‌కు పెద్ద ఊరట ఇచ్చింది. గతేడాది జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 30లోగా చట్టసభకు ఎన్నిక కావాలి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్‌ను కలిసి ఈ నియామకాలకు గురించి ప్రస్తావించారు.

గతేడాది ఆగస్టులో అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా పేర్కొంటూ ప్రభుత్వం.. గవర్నర్‌కు సిఫార్సు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నామినేటైన దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నియామకాలను కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీంతో ఆ ప్రక్రియ కాస్త ఆగిపోయింది. వారిద్దరి నియామకాలపై న్యాయస్థానం స్టే విధించిన విషయం తెల్సిందే.

ALSO READ:  జీతాలు పెంచారు.. డబ్బులు ఎలా తెస్తారు?

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో సంప్రదింపులు చేయాలని ఇటీవీల సుప్రీంకోర్టు సూచన చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేయడంతో కోదండరామ్, అజారుద్దీన్‌లకు లైన్ క్లియర్ అయ్యింది. అయితే తాజా నియామకాలు న్యాయస్థానం తుది తీర్పుపై ఆధారపడి ఉండనున్నాయి. మొత్తానికి ఈ రెండు ఎమ్మెల్సీల విషయంలో కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×