E-Paper
Advertisement

K. Venkata Rao: కేకే కుమారుడికి బెదిరింపు కాల్స్.. రూ. 3 కోట్లు డిమాండ్.. అసలేం జరిగింది?

K. Venkata Rao: కేకే కుమారుడికి బెదిరింపు కాల్స్.. రూ. 3 కోట్లు డిమాండ్..  అసలేం జరిగింది?
Advertisement

K. Venkata Rao: కాంగ్రెస్‌ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు కుమారుడు వెంకటేశ్వరరావును రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేసిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్‌లో వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఓ స్థలం ఉంది. ప్రస్తుతం ఆ స్థల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. ఈ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్‌రెడ్డి, అతడి అనుచరుడు అన్వేష్‌ రెడ్డి రంగంలోకి దిగారు. సదరు ఆస్తితో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటిక.. ఆ క్రమబద్ధీకరణను అడ్డుకుంటామని.. దీని పై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామని వారు వెంకటేశ్వరరావును బెదిరించడం ప్రారంభించారు.

Advertisement

కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలన్నా లేదా కొత్తగా రిట్ పిటిషన్లు వేయకుండా ఉండాలన్నా తమకు 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. విషయం సాఫీగా సాగాలంటే మేము చెప్పింది వినాలి అంటూ ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా పరోక్షంగా హెచ్చరించారు. డబ్బులు ఇవ్వని పక్షంలో న్యాయపరమైన చిక్కులు సృష్టించి.. ఆస్తుల క్రమబద్ధీకరణ కాకుండా అడ్డుకుంటామని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అన్వేష్ రెడ్డి మధ్యవర్తిగా ఉంటూ రఘువీర్‌రెడ్డి తరపున ఈ డిమాండ్లు వినిపించినట్లు సమాచారం.

ఈ వేధింపులు మితిమీరడంతో వెంకటేశ్వరరావు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తనను మానసిక ఆందోళనకు గురిచేస్తూ.. అక్రమంగా డబ్బు వసూలు చేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రఘువీర్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డిలపై BNS సెక్షన్లు 308(3), 351(2), r/w 3(5) కింద కేసు నమోదు చేశారు.

Advertisement

ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. నిందితులు పంపిన మెసేజ్‌లు, కాల్ రికార్డులను పోలీసులు సేకరిస్తున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారు. నిందితులు గతంలో కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: బెల్లంపల్లి బాలికల వసతి గృహంలో ఘోరం.. 40 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×