E-Paper
Advertisement

Khammam : ఆంబులెన్స్‌ లేక.. చిన్నారి మృతదేహాన్ని బైక్‌పైనే తీసుకెళ్లిన తండ్రి..

Khammam : ఆంబులెన్స్‌ లేక.. చిన్నారి మృతదేహాన్ని బైక్‌పైనే తీసుకెళ్లిన తండ్రి..
Advertisement

Khammam : ఖమ్మం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా చేసింది ఆ ఘటన. ఆ తండ్రి ధీనగాధ కన్నీరు పెట్టిస్తుంది. అంబులెన్సు సౌకర్యం లేక కుమార్తె మృతదేహన్ని 65 కిలోమీటర్లు బైక్ పై తీసుకెళ్లాడు ఆ తండ్రి. ఈ ఘటన ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆస్పత్రిలో ఫ్రీ అంబులెన్స్‌ లేక పోవడం.. ప్రైవేట్‌ అంబులెన్స్‌కి డబ్బులు ఇచ్చే స్థోమత లేక పోవడంతో.. కూతురు డెడ్‌బాడీని తండ్రి డైక్‌పై తీసుకెళ్లాడు. ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారి సంచలనం సృష్టిస్తోంది.

చనిపోయిన తన కూతురిని 65 కిలోమీటర్లు బైక్ పై తీసుకెళ్లాడు. మూడేళ్ల కూతురు మృతదేహాన్ని పొత్తిళ్లలో పెట్టుకొని దు:ఖాన్ని దిగమింగుకుంటూ బైక్ పై ప్రయాణించారు ఆబిడ్డ తల్లిదండ్రులు. వాగు దాటుకుంటూ చివరకు ఇంటికి చేరుకున్నారు.

Advertisement

కొత్త మేడేపల్లి గ్రామానికి చెందిన వెట్టి సుక్కి అనే ఆదివాసి గిరిజన బాలిక రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఉచిత అంబులెన్స్ కోసం సిబ్బందిని సంప్రదించాడు. అంబులెన్న్ సౌకర్యం లేదని చెప్పడంతో ప్రైవేట్ అంబులెన్స్, ఆటోలకు పెద్ద మొత్తంలో చెల్లించలేక చనిపోయిన కూతురి మృతదేహాన్ని బైక్ పైనే తీసుకొస్తున్నానని చెప్పాడు తండ్రి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×