E-Paper
Advertisement

Cm Revanth Reddy: డైట్ ఛార్జీల పెంపుపై గురుకుల విద్యార్థుల హ‌ర్షం.. సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు!

Cm Revanth Reddy: డైట్ ఛార్జీల పెంపుపై గురుకుల విద్యార్థుల హ‌ర్షం.. సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు!
Advertisement

Cm Revanth Reddy: తెలంగాణ‌లో డైట్ ఛార్జీల‌ను పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డికి గురుకుల విద్యార్థులు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఖ‌మ్మం జిల్లా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గ గురుకుల పాఠశాల విద్యార్థులు నేడు స‌చివాల‌యంలో సీఎంను క‌లిశారు. ఈ సంధ‌ర్భంగా రేవంత్ రెడ్డి విద్యార్థుల‌తో కాసేపు స‌ర‌దాగా మాట్లాడారు. విద్యా రంగంలో చేపట్టిన సమూల మార్పులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతోనే డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని చెబుతూ విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

Also read: నేను మామూలు హోం మంత్రిని కాదు.. మక్కెలు ఇరగ్గొట్టే హోం మంత్రిని

Advertisement

వ్య‌స‌నాల‌కు బానిసైతే జీవితాలు నాశ‌నం అవుతాయ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక బాధ్య‌త అల‌వ‌రుచుకోవాల‌న్నారు. ఎక్క‌డైనా మ‌త్తు పదార్థాలు కనిపిస్తే పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని తెలిపారు. చ‌దువుతో పాటు విద్యార్థులు క్రీడ‌ల్లోనూ రాణించాల‌ని సూచించారు. అందుకే విద్యార్థి, నిరుద్యోగుల‌కు నైపుణ్య శిక్ష‌ణ అందించ‌డం కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేస్తామ‌న్నారు. టాటా ఇనిస్టిట్యూట్ స‌హ‌కారంతో ఐటీఐల‌ను ఐటీసీలుగా మారుస్తున్నామ‌ని చెప్పారు.

సాంకేతిక నైపుణ్యంతో పాటూ ప్ర‌భుత్వం ఉద్యోగ భ‌ద్ర‌త‌ను కూడా కల్పిస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరంలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర‌వాత విద్యా వ్య‌వ‌స్థ‌పై దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. యువ‌త‌కు స్కిల్స్ కోసం స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌డంతో పాటూ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో టీచ‌ర్ల కొర‌త ఉండ‌టంతో ఇప్ప‌టికే డీఎస్సీ నోటిఫికేష‌న్ ద్వారా టీచ‌ర్ల నియామ‌కం సైతం వేగంగా చేప‌ట్టింది. ప్ర‌భుత్వం విద్యావ్య‌వ‌స్థ బ‌లోపేతంపై దృష్టి పెట్ట‌డంతో మేధావులు సైతం ప్ర‌శంసిస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×