E-Paper
Advertisement

కేటీఆర్ చేసిన పనికి ఆ రోజు మూసుకొని కూర్చున్న.. దానం ఆవేదన

కేటీఆర్ చేసిన పనికి ఆ రోజు మూసుకొని కూర్చున్న.. దానం ఆవేదన
Advertisement

Danam Nagender: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా భూముల వ్యవహారంపై జరిగిన చర్చలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాజీ మంత్రి కేటీఆర్‌పై అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో వివరించిన ఆయన, స్వయంగా తన కుటుంబానికి చెందిన భూమినే కేటీఆర్ కబ్జా చేశారని పేర్కొనడం సభలో పెను దుమారం రేపింది.

దానం నాగేందర్ మాట్లాడుతూ.. తన తండ్రికి చెందిన భూమిని గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ అక్రమంగా ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన వాడినైనప్పటికీ, అప్పటి ప్రభుత్వ వైఖరితో భయపడి ఇన్నాళ్లూ మౌనంగా ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యుల భూములను కబ్జా చేస్తున్నా ఏమీ చేయలేక నోరు మూసుకుని కూర్చున్నామని ఆయన గుర్తు చేశారు.

Advertisement

ముఖ్యంగా బాలానగర్ ప్రాంతంలో జరిగిన భూముల స్కామ్‌లపై దానం తీవ్రంగా మండిపడ్డారు. కేవలం తన భూమి మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల భూ కబ్జాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమాల వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీయడానికి, తక్షణమే ఒక హౌస్ కమిటీని వేసి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. బాలానగర్ భూముల వ్యవహారంపై హౌస్ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలన్నింటిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Also Read: బ్లీచింగ్ పౌడర్‌కు కూడా పైసల్లేవు.. పంచాయతీలు బాగుపడేది ఎప్పుడో? అసెంబ్లీలో పాల్వాయి నిప్పులు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×