E-Paper
Advertisement

Student Suicide Case : విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు.. వెలుగులో కీలక విషయాలు..

Student Suicide Case : విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు.. వెలుగులో కీలక విషయాలు..
Advertisement

Student Suicide Case : హైదరాబాద్ నార్సింగ్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. విద్యార్థి ఆత్మహత్యపై ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ విచారణ చేపట్టింది. ఈ కమిటీ నివేదికలో కీలక అంశాలను పొందుపర్చింది. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న కళాశాలలో అతనికి అడ్మిషన్ లేదని వెల్లడించింది. ఒక కళాశాలలో అడ్మిషన్ తీసుకుని మరో కాలేజీలో తరగతులు నిర్వహిస్తున్నారని పేర్కొంది.

అయితే కమిటీ రిపోర్టులో పేర్కొన్న దానికి భిన్నంగా సాత్విక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. నార్సింగ్ లో ఉన్న శ్రీచైతన్య కళాశాల పేరుతో తమకు ఫీజు రశీదులు ఇచ్చారని తెలిపారు. తమ కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సాత్విక్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

మరోవైపు సాత్విక్‌ ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కళాశాలలో ఉపాధ్యాయుల వేధింపులు వల్ల అవమానం భరించలేక తరగతి గదిలో ఉరి వేసుకుని తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, సూసైడ్‌ నోట్‌ ఆధారంగా శ్రీచైతన్య కళాశాల అడ్మిన్‌ ప్రిన్సిపల్‌ ఆచారి, ప్రిన్సిపల్‌ శివరామకృష్ణారెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ శోభన్‌బాబు , హాస్టల్‌ వార్డెన్‌ నరేశ్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని రాజేంద్రనగర్‌లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో నలుగురినీ చర్లపల్లి జైలుకు తరలించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×