E-Paper
Advertisement

Vijayan: తెలంగాణ పథకాలు కేరళలో.. ఖమ్మం సభ దేశానికి దిక్సూచి: సీఎం విజయన్

Vijayan: తెలంగాణ పథకాలు కేరళలో.. ఖమ్మం సభ దేశానికి దిక్సూచి: సీఎం విజయన్
Advertisement

Vijayan:కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధ్వజమెత్తారు. దేశంలో ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజాసమస్యలను పక్కన బెట్టి.. మోదీ కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఖమ్మం బీఆర్ఎస్ సభ దేశానికి ఓ దిక్సూచి లాంటిదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని తెలిపారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. కంటి వెలుగు అద్భుతమైన పథకం అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను కేరళలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించడం అభినందనీయం అన్నారు. ఈ యుద్ధానికి తమ మద్ధతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×