E-Paper
Advertisement

KCR : నేడు జోగుళాంబ గద్వాల జిల్లాలో కేసీఆర్‌ పర్యటన.. సాయంత్రం బహిరంగ సభ..

KCR : నేడు జోగుళాంబ గద్వాల జిల్లాలో కేసీఆర్‌ పర్యటన.. సాయంత్రం  బహిరంగ సభ..
Advertisement

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవనంతోపాటు, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. 2018 ఎన్నికల ముందు జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2021లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి దశదిన కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా ఏళ్ల తర్వాత సీఎం జిల్లా పర్యటనకు వస్తుండటంతో స్థానికలు హామీలపై ఆశలు పెట్టుకున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణం కోసం 2018లో శంకుస్థాపన చేశారు. రూ. 52.18 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. ఎస్పీ కార్యాలయ నిర్మాణం కోసం రూ. 38 కోట్లు ఖర్చు చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌కు చేరువలో బీఆర్‌ఎస్‌ భవన నిర్మాణాన్ని కూడా గతంలోనే పూర్తి చేశారు. అయితే అధికారికంగా సీఎం కేసీఆర్‌ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. అలాగే మేళ్లచెరువు చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. సుమారు లక్ష మందిని సభకు తరలించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో గద్వాలకు కేసీఆర్ బయల్దేరి వెళతారు. 3 గంటలకు గద్వాల పీజేపీ క్యాంపులోని పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. తొలుత బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పోలీస్‌ కార్యాలయం, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ప్రారంభిస్తారు. అనంతరం మేళ్లచెరువు వద్ద జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×