E-Paper
Advertisement

KCR : టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. అజెండా ఇదేనా..?

KCR : టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. అజెండా ఇదేనా..?
Advertisement

KCR: తెలంగాణలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళుతోంది. తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో విజయఢంకా మోగించి ఉత్సాహంగా ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేసేందుకు గులాబీబాస్ కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరవుతారు.

సమావేశంలో కీలక రాజకీయ అంశాలను కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుందని సమాచారం. మరోవైపు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత ఏవిధంగా ముందుకెళ్లాలన్న విషయంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను ఎలా నిర్వహించాలన్నదానిపై నేతలతో చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలన్న విషయంపైనా చర్చించనున్నారు.

Advertisement

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు రాజకీయంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలనేదానిపై టీఆర్ ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపైనా చర్చ జరగవచ్చు. బీజేపీపై ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి? కాంగ్రెస్‌ విషయంలో ఎలాంటి వైఖరి ఉండాలనే దానిపై నేతలకు కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×