E-Paper
Advertisement

జిమ్‌లో కేటీఆర్ కొడుకు హిమాన్షుకు ప్రమాదం.. AIG ఆసుపత్రికి కేసీఆర్!

జిమ్‌లో కేటీఆర్ కొడుకు హిమాన్షుకు ప్రమాదం.. AIG ఆసుపత్రికి కేసీఆర్!
Advertisement

Himanshu Injury: బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు (కేసీఆర్) గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి చేరుకున్నారు. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ గాయపడిన తన మనవడు హిమాన్షును ఆయన పరామర్శించారు. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ఆసుపత్రికి వెళ్లారు.

జిమ్‌లో ప్రమాదం.. ముక్కుకు గాయం

Advertisement

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు నిన్న జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు స్వల్ప గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు హిమాన్షుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు.

Also Read: నల్లమల అడవుల్లో సంచలనం.. గుండ్లకమ్మ తీరంలో బయటపడ్డ.. 1800 ఏళ్ల నాటి రహస్యాలు!

Advertisement

ఆసుపత్రి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు

హిమాన్షుకు గాయమైందన్న విషయం తెలియగానే తండ్రి కేటీఆర్, బాబాయ్ హరీశ్ రావు వెంటనే ఆసుపత్రికి చేరుకుని వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మనవడిని చూసేందుకు కేసీఆర్ స్వయంగా ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు.

ఆందోళన అవసరం లేదన్న వైద్యులు

హిమాన్షుకు జరిగింది స్వల్ప గాయమేనని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు స్పష్టం చేశారు. కేసీఆర్ రాకతో ఏఐజీ ఆసుపత్రి పరిసరాల్లో బీఆర్‌ఎస్ నాయకులు, భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×