E-Paper
Advertisement

KCR: కేసీఆర్‌తో మాజీ మంత్రులు భేటీ.. అసెంబ్లీ యుద్ధానికి గులాబీ బాస్ వ్యూహరచన

KCR: కేసీఆర్‌తో మాజీ మంత్రులు భేటీ.. అసెంబ్లీ యుద్ధానికి గులాబీ బాస్ వ్యూహరచన
Advertisement

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసానికి (ఫామ్‌హౌస్) చేరుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాబోయే సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి..? ప్రజా సమస్యలపై గులాబీ దళం ఏ స్టాండ్‌తో ముందుకు వెళ్లాలనే అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పథకాల అమలులో జరుగుతున్న జాప్యం, హామీల వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గట్టిగా గళం ఎత్తాలని ఆయన సూచించారు. ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేసి, సాక్ష్యాధారాలతో సహా సభలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

ప్రాజెక్టులు – నిధుల కేటాయింపుపై పక్కా వ్యూహం..

నీటి పారుదల ప్రాజెక్టులు, గత ప్రభుత్వం ప్రారంభించిన పనులకు నిధుల నిలిపివేత వంటి విషయాల్లో రాజీ పడకూడదని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ఇస్తున్న గణాంకాలను ప్రశ్నిస్తూ.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కేసీఆర్ సూచించారు. చర్చకు తగిన సమయం ఇవ్వాలని పట్టుబట్టాలని, ఒకవేళ ప్రభుత్వం చర్చను పక్కదారి పట్టించాలని చూస్తే సభలో గళం ఎత్తి పోరాడాలని ఆయన ఉద్బోధించారు.

Advertisement

గులాబీ దళానికి దిశానిర్దేశం..

అసెంబ్లీలో అనుసరించాల్సిన ఎత్తుగడలపై హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు. ప్రతిపక్షంగా మన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజా పక్షాన నిలబడి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పేర్కొన్నారు. గులాబీ జెండా సిద్ధాంతం, తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా సభలో వ్యవహరించాలని, స్పీకర్ పోడియం వద్దైనా సరే నిరసన తెలపడానికి వెనుకాడకూడదని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

ALSO READ: Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో లిఫ్ట్ అడుగుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త, మహిళ వీడియో వైరల్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×