E-Paper
Advertisement

KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీస్ ఇచ్చిన సిట్.. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని…?

KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీస్ ఇచ్చిన సిట్.. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని…?
Advertisement

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంచలన కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) కేసీఆర్‌కు తాజా నోటీసులు జారీ చేసింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న ఈ పరిణామం, కేసు విచారణలో కీలక మలుపుగా భావించవచ్చు.

ఆదివారం విచారణకు హాజరు కావాలి

సిట్ అధికారులు పంపిన నోటీసుల ప్రకారం.. ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణకు అందుబాటులో ఉండాలి. బంజారాహిల్స్‌లోని ఆయన నందినగర్ నివాసంలోనే అధికారులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతంపై ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టయి రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వారి స్టేట్‌మెంట్ల ఆధారంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ సిద్ధమైంది.

Advertisement

ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని విచారణ సంస్థ అనుమానిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంపై సిట్ దృష్టి సారించింది. గత విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై కేసీఆర్ నుంచి వివరణ కోరనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ బ్యూరో (ISB) నుంచి కీలక డేటా ధ్వంసం కావడంపై కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.

ఈ నోటీసులపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని వారు ఆరోపిస్తుండగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం నందినగర్ నివాసం వద్ద విచారణ ఏ విధంగా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఈ విచారణకు సహకరిస్తారా లేదా అనే దానిపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి.

Advertisement

ALSO READ: Kavitha: తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా.. అదే పరిస్థితి ఏం మారింది..? మేడారంలో కవిత సంచలన వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×