E-Paper
Advertisement

BRS: అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌.. ఎర్రకోటపై గులాబీ జెండా..

BRS: అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌.. ఎర్రకోటపై గులాబీ జెండా..
Advertisement

BRS: బీఆర్ఎస్ ప్రారంభమైంది. కేసీఆర్ సంతకంతో భారత్ రాష్ట్ర సమితి ఉనికిలోకి వచ్చింది. జెండా కూడా రెడీ. ఇక, ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగరడమే తరువాయి అంటున్నారు గులాబీ బాస్. దేశ పరివర్తన కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పారు.

‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనేది బీఆర్ఎస్ నినాదమన్నారు కేసీఆర్. ఢిల్లీలో ఈ నెల 14న భారత్‌ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవసరమని.. మహిళా సాధికారత కోసం కొత్త జాతీయ విధానం తీసుకొస్తామని.. జాతీయ స్థాయిలో కొత్త పర్యావరణ విధానం కావాలన్నారు. ఇకపై రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు ఉండవన్నారు కేసీఆర్.

Advertisement

“నా ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వసాధారణం. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఏర్పాటు సమయంలోనూ ఎన్నో విమర్శలు చేశారు. ప్రతికూల పరిస్థితులు అధిగమించి తెలంగాణ సాధించాం. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు కాదు.. రాజకీయ పార్టీలు.” అన్నారు గులాబీ బాస్.

కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో తెలుగువాళ్లు ఉన్నారని.. తెలుగువాళ్ల కోసం బీఆర్ఎస్ కృషి చేస్తోందని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని.. కుమారస్వామి మళ్లీ కర్ణాటక సీఎం కావాలని ఆకాక్షించారు కేసీఆర్.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×