E-Paper
Advertisement

KCR: రాజకీయంగా కేసీఆర్ యాక్టివ్.. ఆఫ్టర్ లాంగ్ టైం హైదరాబాద్‌కు గులాబీ బాస్

KCR: రాజకీయంగా కేసీఆర్ యాక్టివ్.. ఆఫ్టర్ లాంగ్ టైం హైదరాబాద్‌కు గులాబీ బాస్
Advertisement

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. హైదరాబాద్, నంది నగర్‌లోని తన నివాసానికి చేరుకున్న ఆయన రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ (BRSLP), రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ పార్టీ కార్యాలయానికి వస్తుండటంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

ఈ సమావేశం ప్రధానంగా తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ అజెండాగా సాగనుంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ.. మరో ప్రజా ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్లేలా పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా కేసీఆర్ తన విమర్శల పదును పెంచనున్నారు. నదుల అనుసంధానం పేరుతో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని, రాష్ట్రం నుండి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా నోరు మెదపడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ సమాజం ముందు దోషులుగా నిలబెట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

జల జగడంతో పాటు పార్టీ సంస్థాగత ప్రక్షాళనపై కూడా కేసీఆర్ దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు, నేతల్లో సమన్వయం పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.

Advertisement

ALSO READ: HYDRAA: 124 ఎకరాల చెరువు కాస్త 4 ఎకరాలకు..? నిజాంల నాటి చెరువుకు ప్రాణంపోసిన‌ హైడ్రా

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×