E-Paper
Advertisement

KCR: జీవన్‌రెడ్డితో కేసీఆర్ లంచ్ మీటింగ్.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వేదికగా, పార్టీలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్?

KCR: జీవన్‌రెడ్డితో కేసీఆర్ లంచ్ మీటింగ్.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వేదికగా, పార్టీలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్?
Advertisement

KCR: కాంగ్రెస్ పార్టీకి రాం రాం చెప్పేసిన జీవన్‌రెడ్డి దారి ఎటు? ఆయన్ని ఫామ్‌హౌస్‌కు కేసీఆర్ ఎందుకు పిలిపించారు? కేవలం లంచ్‌కి పిలిచినా దాని వెనుక మతలబు ఏంటి? సీనియర్ నేతకు పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వనున్నారు? ఇవే ప్రశ్నలు చాలామంది బీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్నాయి.

జీవన్‌రెడ్డిని లంచ్ మీటింగ్‌కు ఆహ్వానించిన కేసీఆర్

Advertisement

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి. ఆయనతో కొన్నాళ్లుగా మంతనాలు జరుపుతోంది బీఆర్ఎస్. పార్టీ నుంచి ఆయన బయటకు వస్తున్న విషయం తెలుసుకున్న వెంటనే సన్నిహితుల ద్వారా మంతనాలు జరిపింది. ఈ నేపథ్యంలో గురువారం జీవన్‌రెడ్డి ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో మంతనాలు సాగించారు.

అందులో సానుకూల ఫలితాలు రావడంలో శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు ఆయన్ని లంచ్‌కు ఆహ్వానించారు కేసీఆర్.  ఈ సమావేశంలో బీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. దీనికి సంబంధించిన తేదీని ఖరారు చేయనున్నారు. దీనికితోడు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.

Advertisement

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వేదికగా ఇరువురు నేతల మధ్య కీలక చర్చ

కేసీఆర్ మాదిరిగా రాజకీయాల్లో జీవన్‌రెడ్డి కూడా సీనియస్ నేత. ఆయనకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంచి పట్టు ఉందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ పుంజుకునే సందర్భం లేదు. ఆయన రాకతో ఆ ప్రాంతంలో బలంగా పుంజుకోవచ్చని ఆలోచన. పార్టీలో జీవన్‌రెడ్డి కీలక పదవి ఇవ్వాలని భావిస్తోందట బీఆర్ఎస్.

రాష్ట్రస్థాయి పదవి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  జీవన్‌రెడ్డి రాక వ్యవహారాన్ని కొన్నాళ్లు రాజకీయాల్లో కంటిన్యూ చేయాలని ఎత్తుగడ వేసిందట బీఆర్ఎస్. ఎందుకంటే రేపో మాపో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అందులో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తోంది. మొత్తానికి జీవన్‌రెడ్డి  కారెక్కనున్నారు. రాబోయే రోజుల్లో ఆయనకు ఏ పదవి ఇవ్వనున్నారో తెలియనుంది.

ALSO READ: హైదరాబాద్ కాదు.. ఇది ‘కల్తీ’ సిటీ.. MLC అంజిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×