E-Paper
Advertisement

KCR : కేసీఆర్ దెబ్బకు 47మంది ఆఫీసర్లు ఫసక్!

KCR : కేసీఆర్ దెబ్బకు 47మంది ఆఫీసర్లు ఫసక్!
Advertisement

KCR : పదేళ్లు సీఎంగా ఉన్నారు. అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలు చేశారు. పవర్ పోవడంతో ఆ పాపం పండుతోంది. సీఎం రేవంత్ దూకుడుతో.. కేసులు, కమిషన్లతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫాంహౌజ్ నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గులాబీ బాసుపై ఫోన్ ట్యాపింగ్ కత్తి వేలాడుతోంది. చిన్న దొరను ఫార్ములా ఇ-కారు రేసు వెంటాడుతోంది. ఇక కాళేశ్వరం అవినీతి గురించి చెప్పేదేలే. నిలువునా పగిలిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లే.. కేసీఆర్ చేతులకు బేడీలు పడటం ఖాయమని చెబుతున్నాయి. కాకపోతే అందుకు టైమ్ రావాలి. కమిషన్ విచారణ కంప్లీట్ కావాలి. తిమింగళమే కాదు.. చిన్న చేపలకూ పనిష్మెంట్ తప్పదు. మేడిగడ్డ అవినీతి బురదలో కూరుకుపోయిన వారందరికీ లేటెస్ట్‌గా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చెక్ పెట్టింది. ఎల్ అండ్ టీ సంస్థతో పాటు ఏకంగా 47 మంది ఇంజనీర్లపై చర్యలకు సిఫార్సు చేసింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో బాధ్యులను చేస్తూ.. 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సజెస్ట్ చేసింది. సస్పెన్సన్ లాంటి చర్యలు సరిపోదని భావించింది. అడుగడుగునా ఆ ఇంజనీర్ల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఉందని గుర్తించింది. అందుకే వారిపై ఏకంగా క్రిమినల్ చర్యలకే సిఫార్సు చేయడం మామూలు విషయం కాదు.

Advertisement

ఆ 17 మంది కాకుండా.. మరో 30 మందిపై డిపార్ట్‌మెంటల్ యాక్షన్ తీసుకోవాలని సూచించింది. ఈ లిస్ట్‌లో కాళేశ్వరం మాజీ ENC నల్లా వెంకటేశ్వర్లు లాంటి టాప్ అధికారితో పాటు.. గతంలో SE స్థాయిలో పనిచేసిన రమణారెడ్డి, ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఉన్న తిరుపతిరావు తదితరులు ఉన్నారు. దోషులుగా తేలిన 30 మంది ఇంజనీర్లలో వేరు వేరు విభాగాలకు చెందిన DEEలు, AEEలు ఉన్నారు.

Also Read : దొరకు తొందరెక్కువ అయిందా?

Advertisement

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీకి కారణమంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తప్పుబట్టిన ఆ 47 మంది ఇంజనీర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలా అనే దానిపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్టు సమాచారం. కఠిన చర్యలకే మొగ్గు చూపాలా? వారి పదోన్నతులు ఆపేయాలా? ప్రభుత్వం సలహా తీసుకోవాలా? కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చే వరకు ఆగాలా? ఇలా రకరకాల కోణాల్లో ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

కేవలం ఇంజనీర్లపైనే కాదు.. మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థపైనా యాక్షన్ తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూచించింది. అయితే, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటులో తమ తప్పేమీ లేదని L&T కంపెనీ మొదటినుంచీ వాదిస్తోంది. ప్లేస్ అండ్ ప్లాన్ డిసైడ్ చేసింది అప్పటి కేసీఆర్ సర్కారేనని.. తాము కేవలం నిర్మాణం మాత్రమే చేశామని చెప్పుకొస్తోంది. బ్యారేజీ నాణ్యతలో ఎలాంటి లోపం లేదని.. డిజైన్ ప్రాబ్లమ్ వల్లే బ్యారేజీ కుంగి ఉంటుందనేది ఎల్ అండ్ టీ వాదన. అందుకే, నిర్మాణ సంస్థ చెప్పినదాని ప్రకారమైనా.. విచారణలో బయటకు వస్తున్న విషయాల మేరకైనా.. మేడిగడ్డ డ్యామేజీలో పాపం అంతా కేసీఆర్‌దేనని స్పష్టమవుతోంది. ఎంక్వైరీ కంప్లీట్ అయితేగానీ అసలు దోషులెవరో తేలదు. ఆనాటి సర్కారు ఆడిచ్చినట్టూ ఆడిన అధికారులకు సైతం చిక్కులు తప్పట్లేదు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×