E-Paper
Advertisement

రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఆ అంశాలపైనే స్పెషల్ ఫోకస్!

రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఆ అంశాలపైనే స్పెషల్ ఫోకస్!
Advertisement

BRS Meeting: స్వేచ్చ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ సమావేశంను ఈ నెల 12న ఎర్రవెల్లిలోని పార్టీ అధినేత కేసీఆర్ నివాసంలో నిర్వహిస్తున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పార్టీ తెలిపింది. ఈ సమావేశంలో బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పార్టీ బలోపేతంపై మాట్లాడనున్నట్లు సమాచారం. సమావేశానికి పార్టీ రాష్ట్రకమిటీ ప్రధాన కార్యదర్శులు, శాసన మండలి, శాసనసభాపక్షాల ఉప నాయకులు పాల్గొనాలని పార్టీ సమాచారం ఇచ్చింది.

Also read: మదర్స్ డే రోజున దళపతి విజయ్ కొడుకు పోస్ట్ చూస్తే కన్నీళ్ళు ఆగవు భయ్యా..

సభ్యత్వ నమోదు తేదీ..

Advertisement

మధ్యాహ్నం లంచ్ అనంతరం జరగనున్న ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్చార్జిల నియామకం.. సహా పార్టీ బలోపేతం, తదితర ముఖ్య విషయాలపై చర్చ జరుగున్నదని పార్టీ పేర్కొంది. అయితే సభ్యత్వ నమోదు తేదీని సైతం ప్రకటించబోతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో మోడి భారీ బహిరంగ సభ నిర్వహించడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. కింది స్ధాయినుంచి కమిటీలు వేసి బీఆర్ఎస్ కార్యకర్తలను యాక్టీవ్ చేసే పనిలో నిమగ్నమయ్యే అంశాలు చర్చించే అవకాశం ఉందని కొందరు గులాబీ నేతలు అనుకుంటున్నారు.

Also Read: కాంగ్రెస్ కోటలో ప్రధాని చిచ్చు.. అసలు స్కెచ్ ఏంటి?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×